శ్రీమంతుడు నుండి బలగం వరకు.. స్టోరీని కాపీ చేసారనే ఆరోపణలు ఎదుర్కొన్న 11 చిత్రాల జాబితా..!

Ads

నా స్టోరిని కాపీ చేసి మూవీ తీసారు. క్రెడిట్ నాకు ఇవ్వలేదంటూ మీడియా ముందుకు రావడం అనేది కొత్త  విషయం అయితే కాదు. గతంలో కూడా ఎన్నో సార్లు ఇలాంటివి వచ్చాయి. వస్తూనే ఉన్నాయి కూడా. ఇటీవల విడుదల అయిన ‘బలగం’ మూవీ పై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.

Ads

కమెడియన్ వేణు ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, దిల్ రాజు కుమార్తె ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ మూవీ స్టోరీ నాదే అంటూ ఒక జర్నలిస్ట్ మీడియా ముందుకు వచ్చాడు. న్యాయం జరగకుంటే కోర్టుకి కూడా వెళ్తానంటు మూవీ యూనిట్ ను హెచ్చరించాడు. అయితే గతంలో కూడా కొన్ని సినిమాల పై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. మరి ఆ చిత్రాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.శ్రీమంతుడు :
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఈ మూవీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా కథ నాదే అంటూ,  నారా రోహిత్ తో మూవీ తీయాలని అనుకుంటే  కొరటాల నా స్టోరీని కాపీ చేశాడని శరత్ చంద్ర అనే వ్యక్తి రచయితల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పాటు, కోర్టుకు వెళ్ళాడు.
2. జబర్దస్త్ :
సిద్దార్థ్, సమంత నటించిన ఈ సినిమాకి నందినీ రెడ్డి దర్శకత్వం చేశారు. ఈ మూవీ కథ హిందీలో వచ్చిన ‘బ్యాండ్ బజా భారత్’ ను పూర్తిగా పోలి ఉంది. దాంతో మా సినిమాని కాపీ చేశారని ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ సంస్థవారు కేసు వేశారు.
3.అఆ :
ఈ మూవీని ‘మీనా’ అనే నవల ఆధారంగా రూపొందించారని, తనకు క్రెడిట్ ఇవ్వలేదని, ఈ మూవీ యూనిట్ పై ఫిర్యాదు చేశారు. అప్పట్లో అది సంచలనంగా మారింది. 4.పాండవులు పాండవులు తుమ్మెద :
మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ కలయికలో వచ్చిన ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకుడు. ఈ సినిమా స్టోరీని హిందీలో వచ్చిన  ‘గోల్ మాల్ 3’ నుండి కాపీ చేశారు. దాంతో ‘గోల్ మాల్ 3’ నిర్మాతలు ఈ మూవీ నిర్మాతలైన మంచు కుటుంబం పై కేసు వేయడంతో కోర్టు 90 లక్షలు జరిమానా విధించింది. 5.అజ్ఞాతవాసి :
ఈ సినిమాని ‘లార్గో వించ్’ అనే ఫ్రెంచ్ సినిమా ఆధారం తీయడంతో  ఆ మూవీ నిర్మాతలు వీరి పై కేసు పెట్టడంతో రూ.20 కోట్లు జరిమానా విధించారు. అయితే రాజీ కుదుర్చుకుని ఆ డబ్బు కట్టలేదని తెలుస్తోంది.
6.ఇస్మార్ట్ శంకర్ :
ఈ సినిమాని తాను తీసిన కొత్తగా ఉన్నాడు అనే మూవీని కాపీ చేశారని ఒకప్పటి తెలుగు హీరో ఆకాష్  మీడియా ముందుకు వచ్చాడు. ఏమైందో ఏమో తరువాత సైలెంట్ అయ్యాడు.
7.నిను వీడని నీడను నేనే :
సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఈ సినిమాను ఒక షార్ట్ ఫిలింను కాపీ చేసి తీశారని మూవీ రిలీజ్ రోజే ఆరోపణలు వినిపించాయి. అయితే రెండు కథలు వేరు అవడంతో లైట్ తీసుకున్నారు.
8.క్రాక్ :
కోలీవుడ్ లో విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన ‘సేతుపతి’ రైట్స్ తాను తీసుకుంటే, విలన్ పాత్రను  మార్చి ‘క్రాక్’  తీశాడాని సీనియర్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ ఆరోపించారు.
9.ఆచార్య :
ఈ మూవీ విడుదల అవకముందే ఈ స్టోరి నాది అని ఒక వ్యక్తి ఆరోపణలు చేశాడు. కానీ ఆ తర్వాత కామ్ అయ్యాడు. ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.10.రైటర్ పద్మభూషణ్ :
ఈ మధ్య కాలంలో సుహాస్ హీరోగా వచ్చిన మూవీ రైటర్ పద్మభూషణ్. ‘బరేలీ కి బర్ఫీ’ అనే హిందీ చిత్రాన్ని కాపీ చేశారనే ఆరోపణలు వినిపించాయి.
11.బలగం :
ఇటీవలే విడుదల అయిన బలగం సినిమాకి విమర్శకుల నుండి ఆడియెన్స్ నుండి మంచి స్పందన వచ్చింది. కానీ ఈ స్టోరీ నాదే అని ఒక జర్నలిస్ట్ ఆరోపణలు చేశారు.
Also Read: అక్కినేని, మంచు కుటుంబాలకి ఆ విషయంలో కలిసి రావడం లేదా..?

Previous articleహీరో విక్రమ్ లవ్ స్టోరీ తెలుసా.? తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ నే ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు.!
Next articleఓయ్ సినిమాలో శ్రీలక్ష్మి గా నటించిన ఈ చిన్నపిల్ల గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.