మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా న‌టించి ఆయ‌న‌కే చెల్లి, త‌ల్లిగా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

Ads

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్లిపోతున్నారు. కాస్త గ్యాప్ తీసుకుని లేట్ గా వచ్చినా కూడా లేటెస్ట్ సినిమాలతో అందరినీ ఇంప్రెస్ చేసేస్తున్నారు చిరు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి హిట్ అయింది. నటన పరంగా కూడా ఆయన ఎవరినీ డిసప్పాయింట్ చేయడం లేదు. హీరోలకి ఎన్నేళ్లయినా సరే ఆఫర్లు వస్తూనే ఉంటాయి.

కానీ హీరోయిన్లకి అలా కాదు కాస్త వయసు ఎక్కువ అయితే చాలు హీరోయిన్లుగా అవకాశాలు రావు. దాంతో వచ్చే పాత్రలని చేస్తూ ఉంటారు.

హీరోయిన్ గా అవకాశాలు రాక పోతే ఆ నటులు తల్లిగా లేదంటే చెల్లెలుగా ఇలా ఏ ఆఫర్ వస్తే అది చేస్తారు. నటులుగా కొనసాగాలంటే కచ్చితంగా హీరోయిన్స్ అడ్జెస్ట్ అయి తీరాలి. కొంత మంది హీరోయిన్లు అయితే హీరోయిన్ గా ఓ హీరో పక్కన చేసిన తరవాత మళ్ళీ ఆ హీరో పక్కన చెల్లిగా లేదంటే తల్లిగా చేయాల్సి వస్తుంది. తప్పదు. మెగాస్టార్ చిరంజీవి తో నటించిన హీరోయిన్లకి కూడా ఇలా జరిగింది. ఈ హీరోయిన్లు మెగాస్టార్ పక్కన హీరోయిన్స్ గా నటించారు. వాళ్లే మళ్ళీ చిరంజీవికి తల్లిగా చెల్లెలుగా నటించారు. ఇక మరి ఆ హీరోయిన్లు ఎవరో చూద్దాం.

Ads

చిరంజీవి, జయసుధ:

1979లో ఇది కథ కాదు సినిమా వచ్చింది. ఈ సినిమాకి బాలచందర్ దర్శకత్వం వహించారు అలానే చిరంజీవి మగధీరుడు సినిమాలో కూడా జయసుధ చిరంజీవి సరసన నటించారు. అయితే తర్వాత వచ్చిన రిక్షావోడు సినిమాలో జయసుధ చిరంజీవికి తల్లిగా నటించింది. ఇది చూసి ప్రేక్షకులు షాక్ అయ్యిపోయారు.

చిరంజీవి, సుజాత:

1980లో ప్రేమ తరంగాలు సినిమాలో చిరంజీవి సుజాత హీరో హీరోయిన్లుగా నటించారు. కానీ ఆ తర్వాత వచ్చిన సీతాదేవి సినిమా లో చెల్లెలిగా ఆమె నటించారు.

బిగ్ బాస్ సినిమాలో చిరంజీవి కి తల్లిగా సుజాత నటించారు. ఇది చూసి కూడా ప్రేక్షకులు షాక్ అయ్యిపోయారు.

Previous articleపవర్ స్టార్ పవన్ క‌ళ్యాణ్ రీమేక్స్ లో.. సూప‌ర్ హిట్ అయిన సినిమాలు ఏవో తెలుసా..?
Next articleట్రైన్ లో సీట్లు ఎందుకు బ్లూ కలర్ లో ఉంటాయి…?