ట్రైన్ లో సీట్లు ఎందుకు బ్లూ కలర్ లో ఉంటాయి…?

Ads

దూర ప్రయాణాలు చేయడానికి ట్రైన్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. చాలా మంది అందుకే ట్రైన్ టికెట్లను ముందుగానే బుక్ చేసుకుని ట్రావెల్ చేస్తూ ఉంటారు. రైలు గురించి చాలా విషయాలు మనకి తెలియదు. ఏదైనా ప్రొసీజర్ ని ఫాలో అవుతుంటే దాని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. ఊరికే వాటిని అనుసరించరు. రైలులో మనం చూసుకున్నట్లయితే..

రైలు సీట్లు అన్నీ కూడా నీలం రంగులో ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించి ఉంటారు. మీకు గుర్తుండే ఉంటుంది. అయితే మనకి చాలా రంగులు ఉన్నాయి కదా..

ఎందుకు బ్లూ కలర్ ని ఎంపిక చేశారు..? దీని వెనుక కారణం ఏమిటి అనే ఒకే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా రంగు వెనుక చాలా అర్థం ఉంటుంది. మన మెదడు ఒక్కొక్క రంగుకి ఒక్కో విధంగా రియాక్ట్ అవుతుంది. నీలం రంగు గురించి చూస్తే నీలం రంగు మనకి రక్షణతో పాటుగా రిలాక్సేషన్ ని కూడా ఇస్తుంది. కావాలంటే ఒకసారి నీలం రంగును చూసి గమనించండి. నిజానికి మనం ప్రయాణం చేయాలంటే కాస్త హడావిడి ఉంటుంది. గమ్యస్థానానికి సరైన టైం కి రీచ్ అవుతామా లేదా.. మన సామాన్లని జాగ్రత్తగా తీసుకువెళ్లాలి.. ఇలా ఏదో ఒక టెన్షన్ మన మెదడులో ఉంటుంది.

Ads

తెలియకుండానే ప్రయాణం సమయంలో మనకి ఒత్తిడి కలుగుతుంది. అందుకనే రిలాక్సేషన్ ఫీలింగ్ ని కలిగించడానికి రైలులో సీట్ల ని నీలం రంగులో ఉంచుతారు. కొన్ని బస్సుల్లో కూడా నీలం రంగును ఎంపిక చేస్తారు. అందుకే రైలులో సీట్లన్నీ కూడా నీలం రంగులో ఉంటాయి. ఈ లాజిక్ ని ఉపయోగించి జపాన్ లో ఒక ప్రయోగాన్ని చేశారు. అదేంటంటే టోక్యో నగరంలో స్ట్రీట్ లైట్ లని నీలం రంగులోకి మార్చారు. విచిత్రం ఏమిటంటే ఇలా నీలం రంగులోకి మార్చాక అక్కడ నేరాలు బాగా తగ్గిపోయాయి. నీలం రంగు దీపాలని కనుక చూస్తే కోపం తగ్గే అవకాశం ఉంటుంది ఇలా బ్లూ కలర్ వెనుక ఇంత ఉంది కనుక రైలు సీట్లన్నీ నీలం రంగులో ఉంటాయి.

Previous articleమెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా న‌టించి ఆయ‌న‌కే చెల్లి, త‌ల్లిగా న‌టించిన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?
Next articleకోడలు అత్తకి రాసిన ఉత్తరం ! ఈ రూల్స్ పెట్టకండి అత్తయ్య అంటూ … చూస్తే నవ్వు ఆపుకోలేరు..!