డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన ఈ కొత్త సినిమా చూశారా..? అసలు ఏం ఉంది ఇందులో..?

Ads

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మరొక కొత్త సినిమా రిలీజ్ అయ్యింది. ఇది తమిళ్ సినిమా అయినా కూడా తెలుగులో డబ్బింగ్ అందుబాటులో ఉంది. ఈ సినిమా పేరు సబా నాయగన్. ప్రముఖ నటుడు అశోక్ సెల్వన్ ఈ సినిమాలో హీరోగా నటించారు.

తెలుగు నటి చాందిని చౌదరి, మేఘ ఆకాష్, కార్తీక మురళీధరన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఇది ఒక సరదాగా సాగిపోయే కామెడీ ప్రేమ కథ. ఒక వ్యక్తి 2007 నుండి 2016 వరకు తన జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడో ఈ సినిమాలో చూపిస్తారు.

saba nayagan disney plus hotstar review

కార్తికేయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని, అరవింద్ జయబాలన్, అయ్యప్పన్ జ్ఞానవేల్ నిర్మించారు. లియోన్ జేమ్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి, వస్తే అరవింద్ (అశోక్ సెల్వన్) మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ఒక అబ్బాయి. స్కూల్లో చదువుకునే అరవింద్ కి హాకీ అంటే ఇష్టం ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ అరవింద్ ని సబా అని పిలుస్తారు పిలుస్తారు.

saba nayagan disney plus hotstar review

Ads

అదే స్కూల్లో ఈషా (కార్తీక మురళీధరన్) చదువుతూ ఉంటుంది. అయితే ఈషా అంటే అరవింద్ కి ఇష్టం ఉన్నా కూడా చెప్పడు. ఇంజనీరింగ్ కోసం కోయంబత్తూర్ కి వెళ్ళాక అక్కడ రియా (చాందిని చౌదరి) అంటే ఇష్టపడతాడు. రియా తండ్రి అంటే ఒక పోలీస్ ఆఫీసర్. అయినా కూడా అరవింద్ ఆమెని ఇష్టపడతాడు. కానీ రియా మాత్రం ఇంకొకళ్లని పెళ్లి చేసుకుంటుంది. అప్పుడు మళ్ళీ ఈషా అతనికి ఎదురవుతుంది. ఈషాకి తను బిజినెస్ చేస్తున్నట్టు అరవింద్ అబద్ధం చెప్తాడు.

saba nayagan disney plus hotstar review

కానీ ఆ తర్వాత నిజం చెప్పాలి అనుకుంటాడు. అప్పుడు ఈషా తనకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనే విషయాన్ని అరవింద్ తో చెప్తుంది. అప్పుడు అరవింద్ ఎంబీఏలో చేరతాడు. అక్కడ మేఘ (మేఘ ఆకాష్) తో పరిచయం ఏర్పడుతుంది. అరవింద్, మేఘని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

saba nayagan disney plus hotstar review

తనని అరెస్ట్ చేశాక, స్టేషన్ కి తీసుకెళ్తున్న కానిస్టేబుల్స్ తో ఈ కథ చెప్పడంతో సినిమా మొదలవుతుంది. సినిమా కామెడీగా అలా సాగిపోతుంది. ఒకటి, రెండు ట్విస్ట్ లు ఉంటాయి అంతే. కథ కొత్తది ఏమీ కాకపోయినా కూడా కథనం మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. సరదాగా ఏదైనా సినిమా చూడాలి అనుకునే వాళ్ళు ఈ సినిమాని తప్పకుండా చూసేయండి.

ALSO READ : ఈ పిల్లాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే ఏలేసే అంత పెద్ద హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?

Previous articleపెళ్లయ్యాక “రకుల్ ప్రీత్ సింగ్” జీవితం ఇలాగే ఉంటుందా? వేణు స్వామి ఏం చెప్పారంటే..?
Next article“అనంత్ అంబానీ” కంటే కాబోయే భార్య “రాధిక మర్చంట్” పెద్దవారా..? ఎన్ని సంవత్సరాలు అంటే..?