2022లో ఓవర్సీస్ లో వన్ మిలియన్ వసూల్ చేసిన సినిమాల లిస్ట్..!

Ads

ఈ సంవత్సరం టాలీవుడ్ హిట్ అయిన చిత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే భారీ అంచనాలతో విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. వీటికి ప్రధానమైన కారణం ఓటీటీ ప్లాట్ ఫామ్స్.

కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో అందరూ ఇంట్లోనే ఉండడంతో ఓటీటీల్లో సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నారు. ఇక మరో కారణం అంటే సినిమా టికెట్ ధరలు భారీగా పెరిగిపోవడం. పెద్ద హీరోల సినిమాలు వారాంతంలో నడిచేవి. ఆ తర్వాత సోమవారం నుండి కలెక్షన్లు తగ్గేవీ. అలా తగ్గడానికి ఓవర్సీస్ మార్కెట్ కారణం. డాలర్ ధర ఎక్కువ అందువల్ల వారాంతంకు కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే అక్కడి వారు వీకెండ్ లో మాత్రమే ఎక్కువగా సినిమాలు చూస్తారు.ఈ ఏడాది ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు ఏమిటో, అందులో 1 మిలియన్ వసూల్ చేసిన సినిమాలు ఏమిటో చూద్దాం రండి..1.భీమ్లా నాయక్:
ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా 2400 థియేటర్లలో విడుదలైంది. పవర్ స్టర్ పవన్ కళ్యాణ్, రానా కాంబోలో వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ లో 2.4 మిలియన్ డాలర్లను వసూల్ చేసి హిట్ సినిమాగా నిలిచింది.అయితే తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ మూవీగా నిలిచింది.
2.రాధే శ్యామ్:
రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మార్చి 11 విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ ఓవర్సీస్ లో 2.3 మిలియన్ డాలర్లను వసూల్ చేసింది. కానీ అక్కడ ఎక్కువ ధరలకు ఈ సినిమాని విక్రయించడంతో ప్లాప్ సినిమాగా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.
3.ఆర్.ఆర్.ఆర్:
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్చి 24న విడుదల అయ్యింది. ఎన్టీఆర్,రాంచరణ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఓవర్సీస్ బాక్సాఫీస్ లో ఈ సినిమా 15 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

Ads

4.సర్కారు వారి పాట:
ఈ సినిమా మే 12న విడుదల అయ్యింది. మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా ఓవర్సీస్ లో 2.3 మిలియన్ డాలర్లను వసూల్ చేసి అక్కడ హిట్ అయ్యింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో యావరేజ్ సినిమాగా నిలిచింది.5.ఎఫ్3:
ఎఫ్ 3 సినిమా మే 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ లో 1.26 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి హిట్ కాగా, తెలుగు రాష్ట్రాల్లో అబౌవ్ యావరేజ్ మూవీగా నిలిచింది.
6.మేజర్:
ఈ సినిమా జూన్ 3న విడుదలైంది. అడివి శేష్ హీరోగా వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమా ఓవర్సీస్ లో 1.14 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.7.అంటే సుందరానికి:
ఈ సినిమా జూన్ 10న విడుదలైంది. హీరో నాని, నజ్రియా జంటగా రూపొందిన ఈ సినిమా ఓవర్సీస్ లో 1.1 మిలియన్ డాలర్లను వసూళ్లు సాధించి అక్కడ హిట్ అవ్వగా,తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్లాప్ మూవీగా నిలిచింది.8.సీతా రామం:
ఈ సినిమా ఆగష్టు 5న విడుదల అయ్యింది. తెలుగులో మొదటిసారి నటించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ లో 1.4 మిలియన్ డాలర్లను వసూళ్లు సాధించి అక్కడ హిట్ అయ్యింది.ఇక ఇండియాలో విడుదలైన భాషలలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
9.కార్తికేయ2:
ఈ సినిమా ఆగష్టు 13న విడుదలైంది. హీరో నిఖిల్,చందూ మొండేటి కాంబోలో వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ లో 1.6 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా మూవీగా హిట్ కొట్టింది.10.గాడ్ ఫాదర్:
ఈ సినిమా అక్టోబరు 5న విడుదల అయ్యింది. మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా ఓవర్సీస్ లో 1.28 మిలియన్ కలెక్ట్ చేసి, అక్కడ డీసెంట్ హిట్ గా నిలిచింది.

11.హిట్ 2:
ఈ సినిమా డిసెంబరు 2న విడుదలైంది. నాని నిర్మాణంలో హీరో అడివి శేష్ నటించిన ఈ సినిమాను ఓవర్సీస్ లో 1 మిలియన్ కలెక్ట్ చేసి, క్లీన్ హిట్ అయ్యింది. ఇక తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది.
Also Read: పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లాంచ్ లో త్రివిక్రమ్ ఎందుకు మిస్సయ్యాడు?

Previous articleమజిలీ సినిమాలో ఉన్న ఈ మిస్టెక్ ను ఎప్పుడైనా గమనించారా?
Next articleరిటర్న్ తీసుకోకుండానే అమెజాన్ కొన్ని ప్రొడక్ట్స్ మీద రిఫండ్ ఎందుకు ఇస్తుంది…? లాజిక్ ఇదే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.