మరణించిన వారి అస్థికలను గంగా నదిలో ఎందుకు కలపాలి.. కారణం ఏమిటి..?

Ads

నదులను దేవతలుగా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటాము. హిందూ ధర్మం ప్రకారం గంగా నదీ స్నానానికి చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. పైగా గంగా నది తీరాన హిందూ సాంప్రదాయ ప్రకారం ఎన్నో కార్యక్రమాలను చేపడతారు కూడా. దహన సంస్కారాలను కూడా చేస్తూ ఉంటారు.

అయితే ఎందుకు గంగానది లో చనిపోయిన తర్వాత అస్థికలని కలుపుతారు..? దానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.. ఎవరైనా మనిషి చనిపోతే చనిపోయిన తర్వాత దహన సంస్కారాలని పద్దతి ప్రకారం పూర్తి చేస్తారు. ఆ తర్వాత అస్థికలను గంగానదిలో కలుపుతారు.

ఈ సాంప్రదాయం నిన్న మొన్న వచ్చినది కాదు ఎప్పటి నుండే కూడా ఇదే సాంప్రదాయం ఉంది. హిందువులు మరణించిన వాళ్ళ అస్థికలను ఎందుకు గంగా నదిలో నిమజ్జనం చేస్తారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం…. భారత దేశంలో ఉన్న జీవ నదుల్లో గంగానది ఎంతో ప్రధానమైనది. పైగా గంగా నదిని చాలా పవిత్రంగా పూజిస్తారు.

Ads

హిందువుల మతపరమైన విశ్వాసాలకు మరియు స్వచ్ఛతకి గంగా నది సూచిక. గంగా జలాన్ని కూడా మతపరమైన కార్యక్రమాలకి వాడుతూ ఉంటారు. గంగా నది లో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని అంటారు. పాపాలన్నీ పోయి మోక్షం కలుగుతుందని భావిస్తారు. గంగాజలాన్ని తులసి తో పాటు తీసుకుంటే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని అంటారు.

అయితే మరణించిన వాళ్ళ ఆస్తికలు కలిపితే ఏమవుతుంది..? అగ్ని పురాణంలో 110 అధ్యయనంలో అగ్నిదేవుడే స్వయంగా గంగా నది యొక్క మహత్యాన్ని చెప్తారు. ఎల్లప్పుడూ గంగని సేవిస్తూ ఉండాలి. గంగా నది భుక్తి ముక్తి ప్రధాయిని. భుక్తి తో పాటూ ముక్తిని కూడా ఇస్తుందని అగ్నిపురాణంలో చెప్పబడింది. జన్మలో ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది.

మరణం తర్వాత కూడా ముక్తిని ప్రసాదిస్తుంది గంగానది. గంగ ఎక్కడ నుండి అయితే ప్రవహిస్తుందో ఆ ప్రదేశాలన్నీ పావనాలేనని అగ్నిదేవుడే స్వయంగా చెప్పారు. దహన సంస్కారాలను పూర్తి చేశాక అస్థికలని గంగా నదిలో కలిపితే వ్యక్తి ఆస్తికులు గంగా నదిలో ఉన్నంతవరకు ఆ జీవి స్వర్గంలోనే నివసిస్తారని అగ్నిపురాణం లో చెప్పబడింది.

Previous articleమీ వైవాహిక జీవితంలో తరచుగా గొడవలు వస్తున్నాయా..? మరి ఈ 6 సూత్రాలు పాటించేయండి..!
Next articleఎక్కువ మంది మన దేశంలో చెప్పే అబద్ధాలు ఏవో.. తెలుసా..?