ఎక్కువ మంది మన దేశంలో చెప్పే అబద్ధాలు ఏవో.. తెలుసా..?

Ads

చాలామంది అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఎంత నిజం చెప్పే వాళ్ళైనా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో అబద్దాలు చెప్పడం సహజం. ఎదుటి వాళ్ళు చెప్పిన పని చేయకపోయినా లేదంటే వస్తున్నానని టైంకి రాకపోయినా ఇలా ఏదో ఒక సందర్భంలో అబద్ధాలు కామన్ గా చెప్తూ ఉంటాము. అయితే ఎక్కువగా చెప్పే అబద్దాలు ఇవే… దేశంలో ఎక్కువ మంది ఈ అబద్ధాలనే చెప్తూ ఉంటారు.

Ads

  • చాలామంది ఎక్కువగా ఈ అబద్దం చెప్తారు. అదేంటంటే రెండే నిమిషాల్లో వచ్చేస్తున్నాను అని.. ఎక్కడికి అయినా వెళ్తున్నప్పుడు ఆలస్యం అవుతుందని వీళ్ళకి తెలిసినా కూడా రెండు నిమిషాలు అక్కడ ఉంటానని సింపుల్ గా అబద్ధం చెప్తారు.
  • ఎక్కువ మంది ఈ అబద్ధాన్ని మన దేశంలో చెప్తూ ఉంటారు. రేపటినుండి మందు సిగరెట్ ని తాగను మానేస్తున్నాను అని..
  • ఇది కూడా ఎక్కువ మంది చెప్పే అబద్దమే. వీళ్ళు చెప్పేది అబద్దం అని అందరికీ తెలుస్తుంది కానీ ఇది ఏదో నిజం అన్నట్లు రేపటి నుండి మందు సీక్రెట్ మానేస్తున్నానని అంటూ ఉంటారు. ఫోన్ సైలెంట్ లో ఉంది చూసుకోలేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. దేశంలో చాలామంది ఈ అబద్దాన్ని ఆడుతూ ఉంటారు. అయ్యో చూసుకోలేదు నువ్వు ఫోన్ చేసావా ఫోన్ సైలెంట్ లో ఉండిపోయింది అని అంటూ ఉంటారు.
  • చేతిలో డబ్బులు ఉన్నా కూడా చాలామంది నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు నిజం నమ్ము అని అంటూ ఉంటారు. ఇది కూడా ఎక్కువ మంది చెప్పే అబద్ధం.
  • నాకు పని ఉంది రాలేను అని కూడా చాలామంది ఎక్కువగా చెప్పే అబద్దమే. ఎక్కడికైనా ఎవరైనా రమ్మంటే ఇష్టం లేకపోతే నాకు పనుంది రాలేను అని సింపుల్ గా అబద్ధం చెప్తూ ఉంటారు.
  • అలానే చాలామంది నువ్వే నా ఫస్ట్ లవ్ అని చెప్తూ ఉంటారు ఇది కూడా అబద్ధమే. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రేమికులు ఈ లైన్ ని వాడుతూ ఉంటారు నువ్వే నా ఫస్ట్ లవ్ అని.
  • నేను అబద్ధాలు ఆడను అని ఇంకొంతమంది ఈ అబద్ధాన్ని పదేపదే చెప్తూ ఉంటారు. దేశంలో ఎక్కువమంది చెప్పే అబద్ధాల్లో ఇది కూడా ఒకటి.
Previous articleమరణించిన వారి అస్థికలను గంగా నదిలో ఎందుకు కలపాలి.. కారణం ఏమిటి..?
Next articleపెళ్లి చేసుకోకుండా ఇంకా ఒంటరిగా ఉన్న.. 10 మంది ప్రముఖులు..!