మీ వైవాహిక జీవితంలో తరచుగా గొడవలు వస్తున్నాయా..? మరి ఈ 6 సూత్రాలు పాటించేయండి..!

Ads

ఏ భార్యా భర్త మధ్య అయినా సరే చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. అయితే చిన్న చిన్న వాటిని కూడా పెద్దవిగా సాగదీసుకుంటూ వెళ్తే వైవాహిక జీవితం దెబ్బతింటుంది. చాలామంది భార్యా భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా విడిపోవడమే మేలని భావించి విడాకుల వరకు వెళ్తూ వుంటారు. వైవాహిక జీవితంలో తరచూ గొడవలు వస్తున్నట్లయితే ఈ ఆరు సూత్రాలని కచ్చితంగా పాటించండి. అప్పుడు భార్యా భర్తల మధ్య గొడవలే ఉండవు ఆనందంగా కలకాలం కలిసి ఉండొచ్చు.

  1. ఒకసారి ఆలోచించి మాట్లాడండి:

ఏదైనా మాట్లాడే ముందు ఏదైనా చెప్పాలనుకునే ముందు ఒకసారి ఆగండి. తర్వాత ఆలోచించి ఆ విషయాన్ని చెప్పడం మంచిది. ఇలా చేస్తే గొడవలు పార్ట్నర్ మధ్య రావు.

2. సమస్యని పరిష్కరించుకోండి:

చాలా మంది సమస్యను పక్కనపెట్టి ఏవేవో చెప్తూ ఉంటారు. నిజానికి సమస్య ఏంటి అనేది చూసి దానిని పరిష్కరించుకోండి. అంతేకానీ అసలు మ్యాటర్ ని వదిలేసి మిగిలిన వాటిని ఆలోచిస్తూ ఉంటే బుర్ర పాడవుతుంది భార్యాభర్తల మధ్య సమస్య పెరుగుతుంది.

Ads

3. మీ పార్ట్నర్ ని నిందించకండి:

మీ యొక్క భావాలని చెప్పినప్పుడు ఇతరులను నిందించడం మంచిది కాదు. వారు చేసే తప్పులు గురించి చెప్పకండి. అలానే వాళ్ళని నిందించకండి.

4. చెప్పేది వినడం ముఖ్యం:

మొదట వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా వినండి చాలామంది అసలు వినరు వాళ్ళు చెప్పేదే ఇతరులు వినాలని అనుకుంటారు తప్ప ఇతరులు చెప్పేది అస్సలు వినరు.

5. వారి స్థానంలో ఉండి చూడండి:

ఎప్పుడైనా మీకు వాళ్ళు ఎందుకిలా చేశారు అనే సందేహం వస్తే వాళ్ల స్థానంలోకి వెళ్లి చూడండి అప్పుడు కచ్చితంగా వాళ్ళు కరెక్ట్ అని మీకు అర్థమవుతుంది.

6. సరైన టోన్ లో మాట్లాడండి:

కాస్త రిక్వెస్ట్ గా మాట్లాడండి అంతేకానీ గట్టిగా అరుచుకుంటూ వెళ్తే సమస్య ఇంకా పెద్దది అవుతుంది ఇలా కనుక భార్యాభర్తలు అనుసరించారంటే కచ్చితంగా వాళ్ళ బంధం బాగుంటుంది. వైవాహిక జీవితంలో తరచు గొడవలు వస్తున్నట్లయితే ఈ సూత్రాలను తప్పక పాటించండి అప్పుడు ఆనందంగా ఉండొచ్చు.

Previous articleపాండవుల మరణం తర్వాత…“ధర్మరాజు” మాత్రమే స్వర్గానికి వెళ్ళాడు ఎందుకు..?
Next articleమరణించిన వారి అస్థికలను గంగా నదిలో ఎందుకు కలపాలి.. కారణం ఏమిటి..?