Balli Sastram in Telugu : మన శరీరంలో ఏయే భాగాలలో బల్లి పడితే ఎలాంటి ఫలితాలుంటాయో మీకు తెలుసా..?

Ads

Balli Sastram in Telugu: హిందువులు ఎంతో పురాత‌న కాలం నుంచి అనేక శాస్త్రాలు, పురాణాల‌ను విశ్వ‌సిస్తూ వ‌స్తున్నారు. వాటిల్లో బ‌ల్లి శాస్త్రం కూడా ఒక‌టి. అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు.కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది.

Ads

బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం.బ‌ల్లి ప‌డితే 14 మాసాల్లో మ‌ర‌ణిస్తార‌ట‌. అయితే దేహంపై బ‌ల్లి ఎప్పుడు, ఎక్క‌డ ప‌డినా వెంట‌నే త‌ల‌స్నానం చేయాలి. త‌రువాత ఇష్ట దైవానికి పూజలు చేయాలి. దీంతో బల్లి శాస్త్రం ప్ర‌భావం ఉండ‌ద‌ని చెబుతున్నారు.

Balli sastram in telugu
Balli sastram in telugu

బల్లి శాస్త్రం అయితే బల్లి పురుషుల మీద మీద పడితే వారికీ ఒక విధమైన ఫలితాలు అలాగే స్త్రీల మీద పడితే వాళ్ళకి ఒకవిధమైన ఫలితాలు వస్తాయి .కొందరు బల్లి మీద పడితే చాలా ఆందోళన చెందుతారు, ఏమైతుందో అని. కానీ, మన శరీర భాగాలలో ఏ ఏ చోట బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

బల్లి స్త్రీల శరీరంపై పడితే:

  • తలపై -మరణ భయం
  • చేతులపై-ధన లాభం
  • ఎడమ చేయి-మెంటల్ స్ట్రెస్, అనవసరమైన ఒత్తిడి
  • వేళ్ళపై- నగల ప్రాప్తి
  • కుడి భుజం- కామ రాతి ప్రాప్తి కలుగుతుంది
  • భుజం-నగల ప్రాప్తి
  • తొడలు-కామము
  • కొప్పుపై-రోగాల భయం
  • పిక్కలపై-బంధువుల రాక
  • ఎడమ కన్ను – మీ భర్త / దగ్గరైన వారి ప్రేమ పొందుతారు
  • కుడి కన్ను -మనోవ్యధ , అనవసరమైన టెన్షన్స్
  • కింది పెదవి -కొత్త  వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి
  • రెండు పెదవులపై -కష్టాలు, సమస్యలు ఫేస్ చేయాలి
  • వీపుపై-మరణ వార్త వింటారు
  • గోళ్ళపై -చిన్న చిన్న కలహాలు, గొడవలు
  • రొమ్ము లేక వక్షస్థలం-మంచి జరుగుతుంది
  • కుడి చెంప -మగ శిశువు జన్మిస్తాడని
  • కుడి చెవి-ధన లాభం, ఆదాయం
  • పై పెదవి-విరొధములు కలుగుతాయి
  • మోకాళ్ళు -ఆదరణ, అభిమానం, బంధము
  • చీలమండము -కష్టాలు
  • కుడి కాలు -శత్రు నాశనం జరుగుతుంది
  • కాలి వేళ్ళు- పుత్రుడు జన్మిస్తాడు.

మగవారిపై బల్లి మీద పడ్డప్పుడు:

  • కాలి వేళ్ళ పై -అనారోగ్య సమస్యలు
  • పాదములపై -ప్రయాణానికి సిద్ధం
  • తలపై భాగాన-మరణం వెంటాడుతున్నట్లు
  • ఎడమ చెవి -ఆదాయం బాగా వస్తుంది, లాభము
  • పై పెదవి -కలహాలు వెంటపడుతాయి
  • కింది పెదవి-ఆదాయంలో లాభం కలుగుతుంది
  • రెండు పెదవుల మధ్య -మృత్యువు సంభవిస్తుందని
  • వీపుపై ఎడమ భాగం-విజయం కలుగుతుంది
  • వీపుపై కుడి వైపు- రాజ భయం
  • మణికట్టు -అలంకార ప్రాప్తి కలుగుతుంది
  • మోచేయి – డబ్బు నష్టం
  • వ్రేళ్ళ పై -అనుకోకుండా బంధువుల, స్నేహితుల రాక
  • కుడి భుజం -కష్టాలు, సమస్యలు
  • ఎడమ భుజం -పదిమందిలో అగౌరవం జరుగుతుంది
  • తొడలపై -దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి
  • మీసాలపై -కష్టాలు వెంటాడుతాయి
  • ముఖంఫై- ఆర్ధిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు
  • ఎడమ కన్ను -అంతా శుభమే జరుగుతుంది
  • కుడి కన్ను -చేసి పని విజయవంతం కాదు , అపజయం కలుగుతుంది
  • నుదురుపై -ఇతర సమస్యలలో చిక్కుకోవడం, విడిపోవడం
  • కుడి చెంప- బాధపడటం
Previous articleSwarnagiri Venkateswara Swamy Temple Darshan: Timings, Booking & More
Next article4 మహిళలు… 4 జీవితాలు… ఒకే కథ..! ఈ సినిమా చూశారా..?