చంద్రబాబు నాయుడు అరెస్ట్ కేసులో “లాయర్ లూథ్రా” వేసిన ప్రశ్నలు ఇవే..!

Ads

గత రెండు రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో సునామీ సృష్టిస్తున్న విషయం చంద్రబాబు. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో విజయవాడ ఏసీబీ కోర్టు లోపల హోరాహోరీగా వాదనలు జరుగుతున్నాయి.

ఇప్పటికే సిబిఐ తరఫు వాదనలు పూర్తి కావడంతో.. టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తన వాదనలను వినిపించారు. ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం…సుమారు గంటకు పైగా అనర్గళంగా వాదించిన లూథ్రా వాగ్ధాటికి ఎటువంటి సమాధానం ఇవ్వాలో అర్థం కాక అధికార పార్టీతో పాటు సిఐడి అధికారులు సైతం సైలెంట్ అయిపోయారు.

ఎన్నో ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న సిఐడి లాయర్లు సైతం ముక్కున వేలేసుకునే పరిస్థితి ప్రస్తుతం కోర్టులో కనిపిస్తుంది. అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమిటి..? ఇది ఎప్పుడు జరిగింది.? అసలు చంద్రబాబుకు దీనికి ఎలా సంబంధం ఉంది..? ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు అరెస్టు చేసిన తీరు ఏంటి…? ఇలా ఒకటి ,రెండు కాదు ఏకధాటిగా ప్రశ్నల వర్షం కురిపించి అవతలి వారిని నోరు ఎత్తనివ్వకుండా చేశాడు లూథ్రా. అలాగే గతంలో జరిగిన కొన్ని కేసులను సైతం ఉదాహరణగా తీసుకువచ్చి వాదిస్తున్న అతని వాదన పటిమకు కోర్టులో గాలి సైతం స్తంభిస్తుంది.

ఇంతకీ లూథ్రా లేవనెత్తిన ఆ కీలకమైన విషయాలు ఏమిటో చూద్దాం..

 • అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది కేవల రాజకీయ ప్రేరేపితం
 • 20201లో నమోదైన ఈ కేసుకి హైకోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి.
 • తీర్పు కూడా రిజర్వ్ అయిన ఈ కేసు ఎప్పుడో ముగిస్తే …దానికి సంబంధించిన నిందితులందరికీ బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది.
 • ఇప్పుడు ఈ క్షణంలో ఎన్నికలు వస్తున్నాయని.. కావాలని చంద్రబాబును ఇరికించాలని తిరిగి ఈ కేసుని ఓపెన్ చేశారు.
 • చంద్రబాబు పై చేస్తున్న ఆరోపణలన్నిటికీ ఆధారాలే లేవు.

Ads

 • రూలింగ్ పార్టీ ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబును టార్గెట్ చేస్తూ చేసిన పని ఇది.
 • మీరు చెప్పిన సెక్షన్-409 చంద్రబాబుకు వర్తించదు.
 • ఏ-35 ఘంటి వెంకట సత్యభాస్కర్ ప్రసాద్‌.. పైగా అతన్ని అదుపులోకి కూడా తీసుకున్నారు.. మరి అలాంటి సమయంలో సెక్షన్-409 ఎలా వర్తిస్తుంది?
 • అసలు ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేనప్పుడు.. సిఐడి అతన్ని ఎలా అరెస్టు చేస్తుంది?
 • రిమాండ్ రిపోర్టులో దర్యాప్తు అధికారి వాడిన భాష సరి అయినది అని మీరు భావిస్తారా?

 • అరెస్టు చేసిన తర్వాత చంద్రబాబును నంద్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం ఉన్నప్పటికీ కావాలని ఇంత హైడ్రామా నడిపి వాళ్లు అనుకున్న చోటే ప్రవేశపెట్టడం జరిగింది.
 • నేరుగా కోర్టు ముందు ప్రవేశపెట్టకుండా 24 గంటల పాటు ఏ ఉద్దేశంతో చంద్రబాబును నిర్బంధించారు అర్థం కావడం లేదు..?
 • చంద్రబాబు లండన్ వెళ్తున్నట్టు సిఐడి చేసిన ఆరోపణలలో నిజం లేదు. ఎందుకంటే చంద్రబాబు ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినట్లు సిఐడి చెబుతోంది కానీ నిజానికి బాబుని ముందు రోజు రాత్రి 11 గంటలకే వాళ్ళు చుట్టుముట్టారు. అంటే అరెస్ట్ ఆ సమయంలోనే జరిగింది అని పరిగణించాలి.
 • ఇలా 11 గంటలకు చుట్టుముట్టి కదలకుండా చేయడం అనేది వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది.
 • ఈ కేసులో పాల్గొన్న సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డులను అందించే విధంగా కోర్టు ఆదేశాలు ఇవ్వాలి. ఈ అరెస్టు విషయంలో పాల్గొన్న అందరి పోలీసుల 48 గంటల కాల్ డేటా కోర్టుకు సమర్పించాలి.
 • మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ను అరెస్టు చేయాలి అంటే గవర్నర్ అనుమతి అవసరం..
 • ఇది కేవలం ఒక అనుబంధ పిటిషన్ మాత్రమే.. అలాంటప్పుడు రిమాండ్ రిపోర్టు వరకే వాదనలు పరిమితం చేయాల్సి ఉంటుంది.

ఇలా ఒకదాని తర్వాత ఒకటి అనర్గళంగా ప్రశ్నించిన లూథ్రా…ఈ నేపథ్యంలో జారీ చేసిన రిమాండ్ రిపోర్టును తిరస్కరించాల్సిందిగా కోరుతూ ఇంతకు ముందు జరిగిన పంజాబ్ మణిందర్ సింగ్ కేసును ఉదాహరణగా ప్రస్తావించారు. అయితే కోర్టులో ఇరుపక్షాల మధ్య తీవ్ర రూపంలో వాదోపవాదాలు జరిగాయి. అయితే ఈ కేసు పై తీర్పు ఇంకా కాసేపట్లో విడుదల అవుతుంది. మొత్తానికి ఏసీబీ కోర్టు ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎంతో ఉత్కంఠంగా ఉంది. తీర్పు వచ్చిన తరువాత ఏం జరుగుతుందో కూడా అర్థం కాని గందరగోళం అక్కడ కనిపిస్తోంది.

Also Read: చంద్రబాబు కేసు వాదించే లాయర్ ఎవరో తెలుసా.? గతంలో ఆయన వాదించిన కేసులు ఏంటంటే.?

Previous articleహెయిర్ డ్రైయర్ లు ఇస్త్రీ పెట్టెలు కాదు… శ్రీలంక బోర్డుని చూసైనా మన BCCI నేర్చుకుంటే బాగుంటది.?
Next articleఒకప్పుడు బిగ్ బాస్ విన్నర్…ఇప్పుడు రైతుగా.? ఎవరో గుర్తుపట్టారా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.