మన ఇండస్ట్రీలో బంధుత్వం ఉన్న ఈ సెలబ్రిటీలు ఎవరో తెలుసా..? రాజమౌళికి ఆ ప్రొడ్యూసర్ బావ అవుతారా..?

Ads

మామూలుగా వృత్తి, వ్యాపారం ఇలా ఏ ఇండస్ట్రీ తీసుకున్న మనం పని చేసే దగ్గర బంధువులు ఉండటం సహజమే. ఎందుకు ఫిలిం ఇండస్ట్రీ ఎటువంటి మినహాయింపు కాదు.

నటవారసులుగా ఎంటర్ అయిన వాళ్ల గురించి బాగా అవగాహన ఉంటుంది కానీ మిగిలిన వారికి పలానా వారి బంధువులు అని చెప్పుకుంటే తప్ప పెద్దగా అసలు వాళ్లకు బంధుత్వం ఉందా అన్న విషయం కూడా మనకు తెలియదు.

celebrities who are relatives

భోళా శంకర్ మూవీ డైరెక్టర్ మెహర్ రమేష్ మరియు చిరంజీవి కజిన్స్ అవుతారట. ఈ విషయం చాలామందికి తెలియదు.. ఇదే విధంగా సినీ ఇండస్ట్రీ లో అన్న.. తమ్ముళ్లు, బావా ..బామ్మర్దులు, మామ.. అల్లుళ్ళు…ఇలా ఎంతోమంది ఉన్నారు. మరి వారెవరు ఓ లుక్ వేద్దాం పదండి.

celebrities who are relatives

గోపీచంద్ ,శ్రీకాంత్ మేనకోడల్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ విధంగా శ్రీకాంత్ ,గోపీచంద్ కు బాబాయ్ అవుతాడు.

celebrities who are relatives

Ads

సిరివెన్నెల సీతారామశాస్త్రి మేనకోడలు సౌజన్య శ్రీనివాస్ను త్రివిక్రమ్ పెళ్లి చేసుకోవడంతో, ఆయన సీతారామశాస్త్రికి కొడుకు వరస అవుతాడు.

celebrities who are relatives

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధా మరియు తమిళ్ హీరోయిన్ అంబికా అక్క చెల్లెలు అవుతారు.

celebrities who are relatives

దివంగత నటుడు శ్రీహరి భార్య డిస్కో శాంతి, ప్రకాష్ రాజ్ మొదటి భార్య లలితా కుమారి ఇద్దరు అక్క చెల్లెలు. అంటే శ్రీహరి ప్రకాష్ రాజ్ తోడల్లుడ్లు అవుతారు.

celebrities who are relatives

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శీను, పోసాని కృష్ణ మురళికి కజిన్ అవుతారు. ఇలా మనకు తెలియకుండా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది బంధువులు ఉన్నారు. కొందరు పుట్టుకతో బంధువులు అయితే మరికొందరు పెళ్లిళ్ల కారణంగా బంధువులైన వారు ఉన్నారు.

Previous articleఆమెని చూసి “సమంత” ఈర్ష పడుతుందా.? విజయ్ దేవరకొండ-సమంతలతో ఉన్న ఈమె ఎవరు.?
Next article“జైలర్”లో తమన్నా బాయ్ ఫ్రెండ్ ఆ డైరెక్టర్ కొడుకని తెలుసా.? అతని బ్రదర్ కూడా హీరోనే.!