ఒకే లాగా కనిపించే ఈ సెలబ్రిటీస్ గురించి తెలుసా?

Ads

ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. ఒకే తల్లి కడుపున పుట్టిన కవలలు ఒకే లాగా ఉంటే మన ఆశ్చర్యం వెయ్యదు కానీ బయట వాళ్ళు ఎవరైనా మన పోలికలతో కనిపిస్తే కచ్చితంగా షాక్ అవుతాం. అలాంటిది సోషల్ మీడియా పుణ్యమా అని ప్రస్తుతం క్రేజీ సెలబ్రిటీ మ్యాచింగ్ మారథాన్ నడుస్తోంది. అంటే ఓ సెలబ్రిటీస్ కి ఎటువంటి సంబంధం లేకుండా ఒకేలాగా కనిపించే వ్యక్తులను వెతికి పట్టుకోవడం అన్నమాట.

ఈ లెక్కలోకి మహిళా క్రికెటర్లే కాదు సినీ బ్యూటీలు కూడా ఉన్నారు. మరి ఈ సెలబ్రిటీలను పోలిన వ్యక్తులు ఎవరో ఓ లుక్ వేదమా…

సారా టేలర్– క్వింటన్ డీకాక్

2006 నుండి 2019 వరకు ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ చట్టలో కీలక పాత్ర పోషించిన ప్లేయర్ సారా టేలర్. 2019లో రిటైర్మెంట్ తీసుకొని పురుషుల కౌంటీ క్రికెట్ కోచ్ గా పని చేస్తున్న ఈమెకు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డి కాక్‌ కు పోలికలు ఎక్కువగా కలుస్తాయి.

రోజ్ మేరీ మైర్ – వాణి కపూర్

Ads

2019 నుండి న్యూజిలాండ్ టీమ్ నుంచి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోజ్ మేరీ మైర్, బాలీవుడ్ నటి వాణి కపూర్ ని పోలి ఉంటుంది. ఇద్దరు పొడవుగా, సన్నగా, ఎంతో ఫిట్ గా ఉంటారు.

బిస్మా మరూఫ్ – ధ్వని భానుశాలి

ఇండియన్ పాప్ సింగర్ ధ్వని భానుశాలి ,పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ ఒకేసారి చూస్తే కవలలు అని డౌట్ రాక మానదు. క్రికెట్ అభిమానులు భానుశాలని, మరూఫ్ డోపెల్‌ గ్యాంజర్ అని పిలుస్తారు ఇద్దరి మధ్య పోలికలు ఎంత గట్టిగా ఉన్నాయో అర్థం అవుతుంది.

సనా మీర్ – రష్మిక మందన్న

టాలీవుడ్ ఎక్స్ప్రెషన్ క్వీన్ రష్మిక మందన్న,పాకిస్థాన్ మాజీ క్రీడా కారిణి సనా మీర్ కు మధ్య చాలా పోలికలు ఉంటాయి.

ఎల్లీస్ పెర్రీ – సాగరిక ఘాట్గే

ప్రస్తుతం ఉన్న మహిళా క్రికెటర్లలో అత్యంత ప్రసిద్ధిగాంచిన క్రికెటర్ గా పేరు పొందిన ఎల్లీస్ పెర్రీ,ఇండియన్ యాక్ట్రెస్ కమ్ మోడల్ అయిన సాగరిక ఘాట్గే మధ్య పోలికలు ఉన్నాయ. ఇద్దరు ఒకే ఫ్రెండులో కనిపిస్తే సిస్టర్స్ అనుకుంటారు.

Previous articleవరుస డిజాస్టర్ తో ఇరకాటంలో పడ్డ అనిల్ సుంకర….
Next articleసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో కనిపించిన సుప్రియ ఐసోల ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలుసా?