సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో కనిపించిన సుప్రియ ఐసోల ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో తెలుసా?

Ads

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం గుర్తుండని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఎంతో అందంగా సాగే కుటుంబ కథా చిత్రంతో అందరిని ఆకట్టుకున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర ఎంతో అద్భుతంగా చిత్రీకరించారు. ఈ సినిమాలో వెంకటేష్ మరియు మహేష్ బాబు హీరోలుగా నటించారు. హెవీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నంతగా , థియేటర్లో మూవీ ఆకట్టుకోలేకపోయింది.

కాన్సెప్ట్ బాగున్నప్పటికీ మూవీకి యావరేజ్ టాక్ మిగిలిపోయింది. ఇక ఈ మూవీలో మహేష్ బాబు మంచి లవర్ బాయ్ గా కనిపించారు. అమ్మాయిల్ని అప్పుడప్పుడు ఆటపట్టిస్తూ సరదాగా తిరిగే క్యారెక్టర్ లో మహేష్ చాలా లైవ్లీగా ఉంటారు. ఈ సినిమాలో మహేష్ బాబు తన ఊరికి వెళ్లేటప్పుడు రైల్వే లో ఒక అమ్మాయి తో పరిచయం ఏర్పడుతుంది. స్టేషన్లో దిగాక వెంకటేష్ చూసేటప్పుడు అమ్మాయిని మహేష్ అవాయిడ్ చేసే సీన్ చాలా గమ్మత్తుగా ఉంటుంది.

Ads

సినిమాలో అమ్మాయి పాత్ర చాలా తక్కువ అయినప్పటికీ ఆ ఒకటి రెండు నిమిషాలకే ఆమె బాగా ఫేమస్ అయ్యింది. ఆమె అసలు పేరు సుప్రియ ఐసోలా. ఆ మూవీలో ఎంతో సంప్రదాయంగా కనిపించిన అమ్మాయి బాబు బాగా బిజీ సినిమాలో ఎవరు ఊహించినటువంటి బోల్డ్ క్యారెక్టర్ లో నటించి అందరినీ షాక్ కి గురి చేసింది.

అయితే ఆ మూవీ తర్వాత పాపం తెలుగులో ఆ అమ్మాయికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక్కడే ఉండి రాని అవకాశాల కోసం ఎదురు చూడడం కంటే పక్క ఇండస్ట్రీలో లక్ ట్రై చేసుకోవడం బెటర్ అని ఫీల్ అయిన ఈ పాప బాలీవుడ్లో పలు సినిమాల్లో నటిస్తూ అక్కడే సాలిడ్ గా సెటిల్ అయిపోయింది. అయితే ఎన్ని రోజులు తర్వాత రానా మరియు వెంకటేష్ కలిసి నటించిన రాణా నాయుడు వెబ్ సిరీస్ లో ఓ కీలక పాత్రలో కనిపించింది. అప్పటికి ఇప్పటికీ ఈ అమ్మాయిలో మార్పు చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Previous articleఒకే లాగా కనిపించే ఈ సెలబ్రిటీస్ గురించి తెలుసా?
Next articleరియల్ లైఫ్ బేబీ నడిపిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ..