”ఛెల్లో షో” ని ఆస్కార్ కి పంపించి… కేంద్రం తప్పు చేసిందా..?

Ads

నాటు నాటు పాట ఒక వండర్. నాటు నాటు పాట కి భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం. నామినేషన్స్ కి వెళ్లడమే కాదు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాట కి 95వ ది అకాడమీ అవార్డ్ వచ్చింది. ఇది గర్వించదగ్గ విషయం.

రాజమౌళి ఎంతో అద్భుతంగా ఈ సినిమాని తెర మీదకి తీసుకురావడం జరిగింది. దానికి తోడు కీరవాణి మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ ఇవన్నీ కూడా చక్కగా కుదిరాయి.

ఈ పాటని కాలభైరవ రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడారు. నిజంగా ఎంతో హుషారైన రీతిలో వీళ్లు పాటని పాడడం జరిగింది. రామ్ చరణ్ ఎన్టీఆర్ ఈ పాటకి వేసిన స్టెప్పులు అయితే అదిరింది అనే అనొచ్చు. అయితే ఇంత గొప్ప పాటకి బదులు ఛల్లో షోని కేంద్రం పంపించింది. తెలంగాణకి చెందిన కొంతమంది మంత్రులు అయితే సౌత్ సినిమాలు పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శలు కూడా చేయడం జరిగింది మన సినిమాని కాదని గుజరాత్ కి చెందిన షో ని ఆస్కార్ కి పంపడంతో కేంద్ర వైఖరి ఏంటో క్లియర్ గా తెలుస్తుందని అంటున్నారు.

Ads

ఒకవేళ కనుక ఆ షో ని కాదని ఆస్కార్ కి RRR సినిమాని పంపిస్తే భారత్ అకౌంట్లో ఇంకో ఆస్కార్ అవార్డు వచ్చేదని అంతా అంటున్నారు. ఈ సినిమాని ఆస్కార్ కి పంపకుండా కేంద్రం పెద్ద తప్పు చేసిందని అంతా చెబుతున్నారు. ఆస్కార్ అవార్డుల కోసం ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఇండియా నుండి వచ్చిన బెస్ట్ 14 సినిమాలని షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ తర్వాత ఇండియన్ సబ్మిషన్ ఫర్ ఆస్కార్ జ్యూరీ ఒక సినిమాని ఇండియా నుండి ఎంపిక చేస్తుంది. ఆ సినిమాని ఆస్కార్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం క్యాటగిరిలోకి పంపిస్తారు.

ఇలా ఈ సంవత్సరం ఛల్లో షో ని పంపారు. కానీ ఈ షో ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలియదు పైగా అది 2021 లో రిలీజ్ అయింది. 2022, 2023 ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ చేయడం. రెండు సార్లు ఎంపిక చేసారు. ఒకే సినిమాని రెండు సార్లు షార్ట్ లిస్ట్ చేయడం ఏంటి అని విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఏది ఏమైనా రాజమౌళి RRR సినిమాకి ఆస్కార్ వచ్చేసింది. ఆస్కార్ గెలిచిందన్న వార్త బయటకు వచ్చాక చరణ్, ఎన్టీఆర్ ట్విట్టర్లో ఆనందాన్ని షేర్ చేసుకున్నారు. అంతా అభినందించారు.

Also Read:  ఆస్కార్ వేదిక మీద ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎందుకు డ్యాన్స్ చెయ్యలేదు..? కారణం ఇదేనా..?

Previous articleఆస్కార్ వేదిక మీద ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎందుకు డ్యాన్స్ చెయ్యలేదు..? కారణం ఇదేనా..?
Next articleతారకరత్నకు ”9” ఎందుకు కలిసి రాలేదు… కారణం ఏమిటి..?