ఆస్కార్ వేదిక మీద ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎందుకు డ్యాన్స్ చెయ్యలేదు..? కారణం ఇదేనా..?

Ads

ఆస్కార్ రావడం ఎంతో గొప్ప విషయం. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చింది. ఆస్కార్ రావడం తో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఈ పాటే కనపడుతోంది. ఆస్కార్ అవార్డు గురించే ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు. ఆస్కార్ అనేది భారతీయ ప్రజలు గర్వపడే విషయము.

ఆర్ఆర్ఆర్ సినిమాకి మ్యూజిక్ అందించిన కీరవాణి కి, పాటకి లిరిక్స్ ఇచ్చిన చంద్రబోస్ కి అవార్డు వచ్చింది. దీనితో ప్రముఖులు, సెలెబ్రెటీలు అభినందనలు తెలుపుతున్నారు.

నాటు నాటు పాటకి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఎంతో చక్కగా డాన్స్ చేశారు ఇదంతా కూడా మనం సినిమాలో చూసాం. కానీ ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే ఆస్కార్ వేడుకలో చరణ్ ఎన్టీఆర్ ఎందుకు డాన్స్ చేయలేదు అని… నాటు నాటు పాట వెనక ఎంతో కష్టం ఉంది. ఒక పక్క కోవిడ్ పరిస్థితులు ఉన్నా కూడా నాటు నాటు విషయంలో ఏమాత్రం తగ్గలేదు రాజమౌళి. స్పెషల్ విమానంలో ఉక్రెయిన్ కి వెళ్లి టీం తో పాటు నాటు నాటు పాటని 17 రోజులు పాటు చిత్రీకరించారు.

Ads

అనుకున్నంత విధంగా పాట వచ్చే వరకు కూడా ఏ మాత్రం తగ్గలేదు రాజమౌళి. నాటు నాటు పాట అనుకున్నట్టు వచ్చే వరకు కూడా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ప్రపంచ సినీ అభిమానుల్ని ఆకట్టుకున్న ఈ పాటని ఆస్కార్ వేదికపై ప్రదర్శించారు కూడా. ఆ పాట కి విదేశీ డాన్సర్లు డాన్స్ చేశారు రాహుల్ సిప్లిగంజ్ కాలభైరవ కూడా స్టేజ్ మీద కనబడ్డారు. మరి ఎందుకు ఎన్టీఆర్ చరణ్ డాన్స్ చేయలేదు అనే విషయానికి వచ్చేస్తే… నాటు నాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అమెరికా వెళ్లేందుకు సమస్యలు ఎదుర్కొన్నారు.

వీసా మంజూరు కాకపోవడంతో ఆలస్యం అయింది రిహార్సల్ విషయంలో కాస్త ఇబ్బంది అయింది తక్కువ టైం మాత్రమే ఉండడంతో రిహార్సల్ కుదరలేదు. పైగా ఎన్టీఆర్ రామ్ చరణ్ బిజీ షెడ్యూల్స్ వలన రిహార్సల్ చేయలేక పోవడంతో నాటు నాటు పాటని ఆస్కార్ వేదిక మీద చేయలేదు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ విదేశీ డాన్సర్లతో పాటు నాటు నాటు పాటని స్టేజ్ మీద ప్రదర్శించారు. ఇంతటితో మనం సరి పెట్టుకోవాల్సి వచ్చింది.

Previous articleరాజమౌళి సినిమాల్లో ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ ఇచ్చిన… ఈ 9 పాటలు అన్నీ నెక్స్ట్ లెవెల్ ఏ..!
Next article”ఛెల్లో షో” ని ఆస్కార్ కి పంపించి… కేంద్రం తప్పు చేసిందా..?