తారకరత్నకు ”9” ఎందుకు కలిసి రాలేదు… కారణం ఏమిటి..?

Ads

నందమూరి తారకరత్న ఫిబ్రవరి 18న కన్నుమూసిన విషయం తెలిసిందే. మార్చి 2న ఫిలిం క్లబ్ లో పెద్దకర్మను నిర్వహించారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, నందమూరి కుటుంబ సభ్యులు అంతా కూడా వచ్చారు. తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి తారక రత్న ని తలుచుకొని ఎంతగానో బాధ పడుతున్నారు.

జనవరి 27న గుండె పోటుకు గురై ఆయన బెంగళూరు లోని నారాయణ హృదాయలయ ఆస్పత్రి లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ ని తీసుకున్నారు. ఆయన 23 రోజుల సుధీర్ఘ పోరాటం తరవాత చనిపోయారు. కానీ నిజానికి తారక రత్న ఆసుపత్రి లో ట్రీట్మెంట్ తీసుకుని తిరిగి వస్తారని అంతా అనుకున్నారు.

కానీ అలా జరగలేదు. 23 రోజుల సుధీర్ఘ పోరాటం తరవాత కన్ను మూసారు ఆయన. తారక రత్న సినిమాల్లో నటించి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి కూడా వెళ్లారు. ప్రజలకు సేవ చేయాలని ఆయన అనుకున్నారు అదే ఆయన చివరి కోరిక కూడా. కానీ ఆఖరికి మృత్యువు ఒడిలోకి జారిపోయారు. ఒకే రోజు 9 సినిమాలని లాంచ్ చేసి 2002లో రికార్డును క్రియేట్ చేశారు తారక రత్న. అయితే తారకరత్నకి 9 అంకె కలిసి రాలేదు. ఎంతగా ప్రయత్నించినా కూడా సినిమాలు వెబ్ సిరీస్ లు ఆయనకి ఏ మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు.

Ads

ప్రజాసేవ కోసం కృషి చేయాలని నిర్ణయించుకుని రాజకీయాల్లోకి వెళ్లారు చిత్తూరు జిల్లాలోని కుప్పంలో బావ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఆయన గుండెపోటుకి గురయ్యారు.ఇక తొమ్మిది నెంబరు ఆయనకి ఎందుకు కలిసి రాలేదనేది చూస్తే… 2002లో హీరోగా వచ్చారు ఆయన. ఏకంగా తొమ్మిది సినిమాలని లాంచ్ చేసి రికార్డును క్రియేట్ చేశారు. అయితే రికార్డు క్రియేట్ చేసినా అందులో నాలుగు సినిమాలు మాత్రమే విడుదల అయ్యాయి.

మిగిలిన 6 కూడా షూటింగ్ అవ్వకుండానే ఆగిపోయాయి. ఇలా మనం 9 కలిసి రాలేదని చెప్పొచ్చు. ఆ తర్వాత నైన్ అవర్స్ అనే వెబ్ సిరీస్ తో వచ్చారు. ఆయన అందులో పోలీస్ ఆఫీసర్ గా నటించారు కానీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. 27న గుండెపోటుకి గురయ్యారు. 2+7=9 అయింది. సో 9 కలిసి రాలేదు. ఫిబ్రవరి 18న చనిపోయారు. 1+8=9 ఇలా ఆయనకి 9 ఎప్పుడు కూడా అచ్చు రాలేదు.

Previous article”ఛెల్లో షో” ని ఆస్కార్ కి పంపించి… కేంద్రం తప్పు చేసిందా..?
Next articleసినిమా టిక్కెట్ రేట్లు పెంచ‌మ‌న్న దాసరికి… ఎన్టీఆర్ చెప్పిన జవాబు ఇది..!