సునిశిత్ ని చితకబాది.. చరణ్ ఫ్యాన్స్ ఖర్చులకు డబ్బులు ఇచ్చారు..!

Ads

సునిశిత్ తనకి నోటి కి వచ్చినది చెప్తూనే వున్నాడు. మొదట నుండి కూడా నోటికొచ్చిన‌ట్లు హీరోయిన్స్ గురించి, హీరోల గురించి ఏదో ఒకటి అంటూనే వున్నాడు. ఈ విషయం మనం ఎప్ప‌టి నుంచో చూస్తున్నాము. ఇది వరకే లావణ్య త్రిపాఠితో నాకు పెళ్తైంది అని అన్నాడు. ఆమె పోలీసుల‌కు కంప్లైంట్ చేయడంతో జైల్లో పెట్టారు. బయటకొచ్చాక కూడా తీరు మార్చుకోలేదు.

తమన్నాతో కాపురం చేశానన్నాడు. బాహుబలి సినిమా నాతో చేయాల్సింది.. అలానే ఆర్ ఆర్ ఆర్
సినిమా ఛాన్స్ నాకే వచ్చిందన్నాడు.. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్‌లు నాతో పోల్చుకుంటే హీరోలే కాదు అని కూడా అన్నాడు.. రాజ‌మౌళి అస‌లు దర్శకుడే కాదు అని కూడా అన్నాడు.. ఇలా నోటికొచ్చింది పేలుతూ వున్నాడు. దానితో ఆ మ‌ధ్య నంద‌మూరి ఫ్యాన్స్ చేతిలో దెబ్బ‌లు తిన్నాడు.

అయినా బుద్ది రాలేదు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ చేతిలో దెబ్బలు తిన్నాడు. ఇక అసలేం అయ్యిందో చూస్తే.. మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు మండిపడ్డారు. ఉపాసన మీద సునిశిత్ అభ్యంత‌ర‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసాడు. దానితో మెగా ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. సునిశిత్‌ను ప‌ట్టుకుని.. ఇలా మా వ‌దిన గురించి మాట్లాడతావా అని చితక్కొట్టారు.

Ads

సునిశిత్‌ను కొట్టిన వీడియో నెట్టింట వైర‌ల్ అయ్యింది. వీడియో రూపంలో తాజాగా ఓ విషయం బయట పడింది. రామ్ చ‌ర‌ణ్ అభిమానులు అతన్ని కొట్టాక కొంత డ‌బ్బులు ఇచ్చారు. ఇలా మాట్లాడకూడదు. తప్పు అన్నారు. అలానే ఖర్చులకు ఈ డ‌బ్బులు ఉంచుకో అన్నారు. దెబ్బలు ప‌డ‌టానికి కారణం నీకే తెలుసు. ఇక మీదట అలా చెయ్యద్దు.

ఆడ‌వాళ్ల గురించి మాట్లాడ‌టం త‌ప్పు. రామ్ చ‌ర‌ణ్‌గారు, ఉపాస‌న గారే కాదు ఎవరి గురించైనా అలా మాట్లాడకు. ప‌ర్స‌న‌ల్ విష‌యాల గురించి మాట్లాడితే ఎవ‌రైనా ఇలాగే రియాక్ట్ అవుతారు అని అన్నారు. హ్యాపీగా ఉండు.. హ్యాపీగా బ‌తుకు.. ప‌ర్స‌న‌ల్ విష‌యాలు వద్దు అని డబ్బులు, వార్నింగ్ ఇచ్చారు. సునిశిత్ కూడా సరే అని త‌లూపాడు.

Previous articleచిప్స్ మీద గీతలు ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి అంటే..?
Next articleభీమ్లా నాయక్ హిట్ ని కొట్టలేకపోయిన ఆది పురుష్ ట్రైలర్.. తక్కువ టైంలో 100K లైక్స్ వచ్చిన 10 సినిమాలు.