38 ఏళ్ళ రామ్ చరణ్ కి తల్లిగా… 37 ఏళ్ళ హీరోయిన్..! ఇదెక్కడి వింత..?

Ads

ప్రస్తుతం పరుస పెట్టి సినిమాలు చేస్తున్న హీరోల్లో రామ్ చరణ్ కూడా ఒకరు. రామ్ చరణ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. ఇంకా కొన్ని సినిమాలు డిస్కషన్ దశలో ఉన్నాయి.

ఇప్పుడు చేస్తున్న సినిమాల్లో మొదటిగా చెప్పుకోవాల్సిన సినిమా, శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా. సాధారణంగా శంకర్ సినిమా అంటే భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. శంకర్ చాలా వరకు తమిళ్ సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించారు.

this heroine to act as mother to ram charan

కానీ తమిళ సినిమా స్థాయిని పెంచిన డైరెక్టర్లలో శంకర్ కూడా ఉంటారు. సామాజిక అంశాల మీద ఫోకస్ పెడుతూ, మరొక పక్క కమర్షియల్ అంశాలు కూడా సినిమాలో ఉండేలాగా చూసుకుంటారు. ఇలాంటి విషయాలని బ్యాలెన్స్ చేయడంలో శంకర్ ఎక్స్పర్ట్ అని అంటారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. వినయ విధేయ రామ సినిమా తర్వాత, రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటిస్తున్న సినిమా ఇది. తమన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

this heroine to act as mother to ram charan

శంకర్ తో తమన్ సంగీత దర్శకుడిగా పనిచేయడం ఇది మొదటి సారి. సినిమా కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. శంకర్ దర్శకత్వం వహిస్తున్న మొదటి తెలుగు సినిమా కూడా ఇదే. ఇది తెలుగు సినిమా కావడంతో చాలా మంది తెలుగు నటులు ఈ సినిమాలో ఉన్నారు. శ్రీకాంత్, నవీన్ చంద్ర వంటి ప్రముఖులు ఈ సినిమాలో ఉన్నారు. ఎస్ జె సూర్య వంటి తమిళ్ నటులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. అయితే, ఈ సినిమాలో రామ్ చరణ్ తల్లి పాత్రలో ఒక హీరోయిన్ నటించబోతున్నారు. ఆమె అంజలి.

Ads

this heroine to act as mother to ram charan

రామ్ చరణ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం పోషించబోతున్నారు. అయితే, ఒక రామ్ చరణ్ పక్కన అంజలి హీరోయిన్ గా నటిస్తున్నారు. వీరిద్దరి కొడుకు మరొక రామ్ చరణ్. రామ్ నందన్ ఐపీఎస్ అనే పాత్రలో రామ్ చరణ్ కనిపిస్తారు. ఇది కొడుకు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ పాత్ర. తండ్రి పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ ఒక రాజకీయ నాయకుడి పాత్రలో కనిపిస్తారు. ఈ రామ్ చరణ్ పక్కన అంజలి హీరోయిన్ గా నటిస్తున్నారు.

this heroine to act as mother to ram charan

ఇలా చూసుకుంటే రామ్ చరణ్ తల్లి పాత్రలో అంజలి నటిస్తున్నారు. రామ్ చరణ్ వయసు 38 సంవత్సరాలు. అంజలి వయసు 37 సంవత్సరాలు. కాబట్టి తనకంటే చిన్న వయసు ఉన్న వ్యక్తి రామ్ చరణ్ కి తల్లిగా నటిస్తున్నారు అంటే వింతగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ సినిమాలు అన్న తర్వాత ఇవన్నీ కూడా సహజం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలోని పాట విడుదల చేస్తారు అని సమాచారం. ఈ విషయం మీద అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ALSO READ : కార్తీకదీపం-2 స్టోరీ ఏంటో తెలుసా..? ఆ సీరియల్ కి రీమేక్..?

Previous articleఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇప్పుడు తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది..! ఎవరో తెలుసా..?
Next article“అనంత్ అంబానీ-రాధిక మర్చంట్” లవ్ స్టోరీ గురించి తెలుసా..? వీరి ప్రేమ కథ ఎలా మొదలయ్యింది అంటే..?