వరలక్ష్మీ వ్రతం అసలు ఎలా మొదలైందో మీకు తెలుసా? శివుడు పార్వతికి చెప్పిన కథ ఇదే…!!!

Ads

శ్రావణ మాసంలో జరిగే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామంది ఈ సందర్భంగా ఇంట్లో వరలక్ష్మి పూజ చేసుకొని నోముల నోచుకుంటారు. అయితే పూజా సమయంలో తప్పకుండా పాటించవలసిన ఒక నియమం ఉంది. మామూలుగా గణపతి పూజ, వరలక్ష్మి పూజ పూర్తి చేసిన అనంతరం నైవేద్యం సమర్పించి తోరణం కట్టుకున్న తర్వాత వరలక్ష్మీదేవి వ్రత కథను తప్పకుండా చెప్పుకోవాలి. ఈ కథ సాక్షాత్ పరమశివుడు లోకోపకారం కోసం పార్వతీదేవికి చెప్పడం జరిగింది.

ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చుని ధ్యానముద్రంలో ఉన్న పరమశివుడిని నారద మహర్షి ,ఇంద్రాది దీపాలకులు కీర్తిస్తారు. అనంత సమయంలో పార్వతీదేవి పరమశివుడిని భూలోకంలో స్త్రీలు సర్వ సౌఖ్యములను పొంది వంశాభివృద్ధి తో తరించుటకు ఒక మంచి వ్రతాన్ని చెప్పమని కోరుతుంది. అప్పుడు శంకరుడు స్త్రీలకు సకల సౌభాగ్యాలను శుభాలను కలిగించే వ్రతం వరలక్ష్మీ వ్రతం అని చెబుతారు.

Ads

శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సర్వసౌఖ్యాలు లభిస్తాయని ఆయన చెబుతారు. అయితే వ్రత విధానాన్ని వర్ణించమని పార్వతీదేవి కోరగా పరమశివుడు వరలక్ష్మీ వ్రతం వెనుక అసలు మహత్తును వివరిస్తారు. నగర దేశంలోని కుండినము అనే పట్నం.. బంగారు గోడలతో ఎంతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ నివసించేది. ఆమె ప్రతిదినము తెల్లవారుజామున నిద్ర లేచి భర్త పాదాలకు నమస్కరించి ,ఇంటి పనులను పూర్తి చేసుకొని అత్తమామలకు సేవ చేస్తూ ఉండేది.

ఆమెకు ఒకరోజు కలలో కనిపించిన వరలక్ష్మీదేవి శ్రావణ పౌర్ణమి నాడు వచ్చే శుక్రవారం తనని పూజించమని.. కోరిన కోరికలు తీరుస్తానని చెప్పి అంతర్ధానం అవుతుంది. చారుమతి అమ్మ చెప్పినట్లుగానే శ్రావణ శుక్రవారం నాడు ఇరుగుపొరుగు ముత్తైదువులను పిలిచి ఇంటిలోనే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తుంది. ఇలా తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకొని ప్రదక్షిణ నమస్కారాలు చేస్తున్న సమయంలో మొదటి ప్రదక్షణ పూర్తి కాగానే కాలి గజ్జెలు,రెండవ ప్రదక్షణకు చేతులకు నవరత్న ఖచ్చిత కంకణాలు ,మూడవ ప్రదక్షణకు సర్వాభరణ భూషణాలు అందరికీ వచ్చాయట. అందుకే అప్పటినుంచి అందరూ ఆడవారు వరలక్ష్మి వ్రతాన్ని తప్పక ఆచరిస్తూ ఉన్నారు.

Previous articleస్టార్ డైరెక్టర్లు “ప్రభాస్” డేట్స్ కోసం ఎదురుచూస్తుంటే…”ప్రభాస్” మాత్రం ఆ హీరోయిన్ డేట్స్ కోసం చూస్తున్నారంట.?
Next articleచిరంజీవి బర్త్ డే సందర్బంగా ట్రెండ్ అవుతున్న 10 ఎడిటడ్ వీడియోస్..ఫాన్స్ కి పూనకాలే..!!!