దొంగతనం చేసిన చిరంజీవి, సుధాకర్… ఆ తరవాత ఏం జరిగింది అంటే..?

Ads

మెగాస్టార్ చిరంజీవి గ్యాప్ ఇచ్చి తర్వాత రీఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత నుండి కూడా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య కూడా చిరంజీవికి మంచి హిట్ ని తీసుకు వచ్చింది. చాలా మంది మెగాస్టార్ ని ఆదర్శంగా తీసుకుంటారు. ఇంట్రెస్ట్ కి వచ్చిన మొదట్లో చిరంజీవి ఎన్నో రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు.

ఆయన తరపు నుండి ఎవరు ఇండస్ట్రీ లో లేక పోవడంతో అవకాశాలు ఇచ్చేవారు కాదు. అయితే అవకాశాల కోసం చిరంజీవి ట్రై చేస్తున్న సమయం లో హరి ప్రసాద్, సుధాకర్ చిరంజీవి రూమ్ మేట్స్ గా ఉండేవారు.

వీళ్ళు ముగ్గురు కూడా ఆడిషన్స్ ఇస్తూ ఉండేవారు. అప్పట్లో వీళ్ళకి తినడానికి తిండి కూడా ఉండేది కాదట. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ‘ఇవాళ ఏం కూర చేసుకుందామని’ సుధాకర్ రూమ్ మేట్స్ తో అంటే.. పక్కింట్లో ఉన్న ములక్కాయ చెట్టు కనపడింది. గోడ ఎక్కి చెట్టు ములక్కాయల్ని తెంపి కూర వండుకుని తింటున్న సమయంలో పక్కింటి ఆయన వచ్చి మా చెట్టు ములక్కాయలని తెంపుతారా..? అని పెద్ద గొడవ చేశారట. వండుకున్న కూరని కూడా తీసుకు వెళ్లిపోయారట.

Ads

తర్వాత ఇంకా కష్టపడి ఆడిషన్స్ కి వెళ్లి.. సెలెక్ట్ అయ్యి.. సినిమాలు చేసి ఇప్పుడు పెద్ద పొజిషన్ లో ఉన్నారు. చిరంజీవి ఇప్పుడు కూడా బిజీగా సినిమాలు చేస్తున్నారు. సుధాకర్ మొన్న మొన్నటి దాకా టాప్ కమెడియన్ గా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా కష్టపడితే తప్పక ఫలితం ఏదో ఒక రోజు వస్తుంది ఫలితం రాదేమో అని కష్టపడడం మానేయడం మన తప్పే. ఇదిలా ఉంటే చిరంజీవి భోళా శంకర్ సినిమా లో నటిస్తున్నారు. మెహర్ రమేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. ఈ సినిమాలో మలైకా అరోరా ఒక స్పెషల్ సాంగ్ కూడా చేయబోతున్నట్లు టాక్.

Previous articleభర్తలు దూరం అయినా… పెళ్లి చేసుకోని 10 నటీమణులు వీళ్ళే..!
Next articleచైతన్య విషయంలో నాగార్జున చేసిన తప్పు ఏమిటి..? లేకపోతే టాప్ హీరో అయ్యేవాడు కదా..!