జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులని పెట్టబోతున్నారా..? ఎంతంటే..?

Ads

చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తర్వాత ఎంతో కష్టపడి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని పవర్ స్టార్ గా ఫేమస్ అయిన హీరో పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాబోతున్న హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ జరుగుతోంది. చారిత్రాత్మక నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది.

కొన్ని కారణాల వల్ల సినిమా షూటింగ్ మధ్యలో ఆగి, తర్వాత మళ్లీ మొదలు అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ లో విజయ్ హీరోగా నటించిన తేరి సినిమా రీమేక్ గా రూపొందుతోంది. సుజిత్ దర్శకత్వంలో ఓజి సినిమాలో కూడా నటిస్తున్నారు. ముంబై నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందుకు సంబంధించి విడుదల చేసిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హరి హర వీర మల్లు సినిమా టీజర్ మహా శివరాత్రి కానుకగా విడుదల అవుతుంది అనే వార్త ఒకటి వచ్చింది.

Ads

ఈ విషయం మీద సినిమా బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సినిమా ఆగిపోయింది అనే వార్త వచ్చినప్పుడు సినిమా బృందం స్పందించి, అలాంటిది ఏమీ లేదు అని, సినిమా షూటింగ్ అవుతుంది అని ఒక పోస్ట్ చేసింది. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులకి ఈ వార్త చాలా ఆనందాన్ని ఇచ్చింది. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకపక్క సినిమాలు చేస్తూనే, మరొక పక్క రాజకీయాల్లో కూడా ప్రజలకి సేవ చేయడానికి తనవంతు కృషి చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పవన్ కళ్యాణ్, ప్రచార కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బుల్లో నుంచి కొంత మొత్తాన్ని జనసేన పార్టీ కోసం పెట్టబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ 10 కోట్లని తన సొంత డబ్బుల్లోంచి తీసి పార్టీ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారట. ఇది విన్న అందరూ కూడా పవన్ కళ్యాణ్ చాలా గొప్ప పని చేస్తున్నారు అంటూ పొగుడుతున్నారు. ఇలాంటి ఆలోచన రావడం గొప్ప విషయం అంటూ మెచ్చుకుంటున్నారు.

Previous articleతెలుగులో మొదటి తరం హాస్యనటుల ఫోటో చూశారా..? ఇందులో ఎవరెవరు ఉన్నారంటే..?
Next article”మెగాస్టార్ చిరంజీవి” ఆస్తి మొత్తం ఎంత ఉంటుందో తెలుసా..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.