“ప్రభాస్” గురించి వేణు స్వామి చెప్పినట్టే జరిగిందా..? మరి ఇప్పుడు సలార్ ఎలా ఉంటుంది..?

బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో మరొక బిగ్ బ్లాక్ బస్టర్ ఇంతవరకు పడలేదు. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైన ఆది పురుష్ నిరాశపరిచింది. దీంతో రాబోయే ప్రభాస్ చిత్రాలపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు.

ప్రస్తుతం ప్రభాస్ సలార్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రాజెక్ట్ కే పనులలో బిజీగా ఉన్నారు. సలార్ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని సీన్స్ మార్చాల్సిన అవసరం తలెత్తడంతో చిత్రం విడుదల వాయిదా పడింది.

venu swamy about prabhas

అంతేకాకుండా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కొన్ని సీన్స్ మార్చాలి అని భావించడం తో రీ షూటింగ్ కూడా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇవన్నీ కేవలం పుకారులేనని, గ్రాఫిక్ వర్క్ ఆలస్యం అవ్వడం వల్ల ఇలా జరిగింది అని ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు. కేజిఎఫ్ సక్సెస్ తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న మూవీ కావడం.. పైగా ఇందులో ప్రభాస్ నటించడంతో ఈ మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని అభిమానులు ఆశాజనకంగా ఉన్నారు.

అయితే ప్రస్తుతం ప్రభాస్ చిత్రాలకు టాలివుడ్ లో సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణు స్వామి మాటలకు లింకు కలుపుతున్నారు నెటిజన్లు. బాహుబలి చిత్రాలు వచ్చినప్పటి నుంచే వేణు స్వామి చాలాసార్లు ప్రభాస్ జాతకం గురించి చెబుతూ వచ్చాడు. బాహుబలి 1, 2 తర్వాత ప్రభాస్ కు సంబంధించిన ప్రతి చిత్రానికి ముందు వేణు స్వామి అసలు ప్రభాస్ జాతకం బాగాలేదు అని చెప్పడం…. అంతేకాదు అతనితో సినిమాలు తీసే నిర్మాతలు కూడా తమ జాతకాలు చూపించుకోవాలి అనడం రొటీన్ అయిపోయింది.

Kalki 2898

మామూలుగా అయితే వేణు స్వామి మాటలను ఇండస్ట్రీలో పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ సమంత, నాగ చైతన్య విషయంలో వేణు స్వామి చిలక జోస్యం నిజమవడంతో అతనిపై టాలీవుడ్ ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగాయి. మొదట్లో సమంత, నాగ చైతన్య విడిపోతారు అని వేణు స్వామి చెప్పినప్పుడు అందరూ నవ్విన వారే.. కానీ అందరికీ షాక్ ఇస్తూ వాళ్ళిద్దరూ డైవర్స్ తీసుకున్నారు. దీంతో టాలీవుడ్ లో వేణు స్వామి హవా కాస్త పెరిగింది. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు ఎవరికి తెలియకుండా వేణు స్వామితో ఇంట్లో శాంతి పూజలు కూడా చేయించుకుంటున్నారు.

venu swamy about prabhas

సరే ఇక ప్రభాస్ విషయానికి వస్తే…సాహో పోయింది.. రాధ్యే శ్యామ్ పోయింది…పోనీలే ఆదిపురుష్ గట్టెక్కిస్తుంది…అని అనుకుంటున్న ఫ్యాన్స్ సినిమా విడుదలకు రెండు వారాల ముందు వేణు స్వామి ప్రభాస్ జాతకం గురించి చేసిన సంచలన వ్యాఖ్యలతో నిరసించిపోయారు. ప్రభాస్ జాతకం అస్సలు బాగాలేదని…ఈ కారణంగా సినిమా ఎటువంటి సంచలనాన్ని నమోదు చేయదని.. ఈ మూవీ హిట్ అయ్యే ఛాన్స్ లేదని వేణు స్వామి కచ్చితంగా చెప్పాడు.

venu swamy about prabhas

చాలామంది వేణు స్వామిని అప్పట్లో లైట్ తీసుకున్నారు.. కానీ తీరా సినిమా విడుదలయ్యాక సక్సెస్ మాట దేవుడెరుగు. వివాదాలు వెంటపడ్డాయి. హీరోని పక్కన పెట్టి డైరెక్టర్ ను టార్గెట్ చేసి అన్ని రకాలుగా సోషల్ మీడియాలో తిట్టిపోతారు అభిమానులు.

venu swamy about prabhas

ఇకపోతే సలార్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది కాబట్టి వేణు స్వామి దాని గురించి ఏమన్నా చెప్పాడా అనే ఉద్దేశంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులు తెగ సర్చింగ్ చేస్తున్నారు. అయితే ఇంతవరకు వేణు స్వామి ప్రభాస్ గురించి గానీ, సలార్ చిత్రం గురించి గానీ ఎటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు. దీంతో డార్లింగ్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి వేణు స్వామి త్వరలో దీని గురించి ఏదైనా మాట్లాడతాడా లేక మౌనంగా ఉంటాడా చూడాలి మరి.

Previous article“ఇలాంటి సీన్స్ పెట్టడం అవసరమా..?” అంటూ… రణబీర్ కపూర్ “యానిమల్” మూవీ మీద కామెంట్స్..!
Next articleసూపర్ స్టార్ కృష్ణ శ్రీరాముడి పాత్రలో నటించారా..? ఏ సినిమాలో అంటే..?