పాండవుల మరణం తర్వాత…“ధర్మరాజు” మాత్రమే స్వర్గానికి వెళ్ళాడు ఎందుకు..?

Ads

కురుక్షేత్ర యుద్ధం అయ్యాక 36 సంవత్సరాల పాటు పాండవులు హస్తినపుర రాజ్యాన్ని పాలించిన విషయం తెలిసిందే. శ్రీకృష్ణు, బలరామ అవతారాలు ముగిసిపోతాయి. ఇది తెలిసిన పాండవులు రాజ్యాన్ని త్యజించి వాళ్ళ శరీరాలతోనే స్వర్గాన్ని చేరుకోవాలని అనుకుంటారు. అలా పాండవులు, ద్రౌపది ఆఖరి తమ చివరి ప్రయాణాన్నివిడుస్తారు. దారిలో ద్రౌపది ముందుగా చనిపోతుంది.

దానికి కారణం ఇప్పుడే చూసేద్దాం.. పాండవులు, ద్రౌపది మరణం గురించి మహాభారతంలోని స్వర్గారోహణ పర్వంలో చెప్పడం జరిగింది. పాండవులు హస్తిన పురాన్ని వదిలి వచ్చేస్తుంటే అభిమన్యుని కుమారుడు పరీక్షిత్ రాజుగా పట్టాభిషేకం చేసాక హిమాలయాలకు ప్రయాణాన్ని మొదలు పెడతారు. ఒక కుక్క కూడా అనుసరిస్తుంది.

పాండవులు ద్రౌపదితో పాటు కొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని హిమాలయాలను దాటడం జరిగింది. అయితే ఈ సమయం లో ముందు ద్రౌపది క్రింద పడి చనిపోతుంది. భీముడు ద్రౌపది మరణానికి ధర్మరాజుని కారణం అడగగా.. ద్రౌపదికి పాండవులు అందరు భర్తలు. కానీ అర్జునుడి పట్ల ఎక్కువ ప్రేమ ఆమె కి ఉండేది. అయితే ప్రయాణం లో సహదేవుడు పడిపోయాడు.

Ads

భీముడు సహదేవుడు ఎందుకు అలా పడ్డాడని అడిగితె తనకున్న జ్ఞానానికి ఎల్లపుడూ గర్వంతో ఉండే వాడని ఆ కారణం గానే పడ్డాడని చెప్పాడు. నకులుడు కూడా కింద పడిపోతాడు. అందం పట్ల ఎక్కువగా గర్వపడ్డాడు అందుకే అంటారు. తర్వాత అర్జునుడు పడిపోగా.. ధర్మరాజు భీమునితో యుద్ధానికి ముందు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధాన్ని ఒకే రోజులో ముగించగలనన్న నమ్మకం తో ఉండేవాడని కానీ అలా కుదరలేదు పైగా ఎప్పుడూ ఇతర విలువిద్య నిపుణులను తక్కువ చేసి చూసేవాడని అన్నాడు.

భీముడు పడిపోతూ ఏం చేశా నేను అంటాడు. అతిగా తినేవాడివని, నీ శక్తి సామర్ధ్యాల గురించి ప్రగల్భాలు చెప్పడం అలానే ఇతరులను అగౌరవపరిచే వాడివని అంటాడు. ఆఖరున ధర్మరాజు ముందుకు వెళ్తుంటే కుక్క అతని వెనుకే వస్తుంది. ఇంద్రుడు ప్రత్యక్షం అవుతాడు. ధర్మరాజు ద్రౌపదిని, తన సోదరులను కూడా వెంట స్వర్గానికి తీసుకు వెళ్లాలని అంటాడు ధర్మరాజు.

వారు ఇప్పటికే స్వర్గానికి చేరుకున్నారని అంటాడు ఇంద్రుడు. తనతో పాటు కుక్కను కూడా స్వర్గానికి తీసుకెళ్లలాని అంటాడు. కుక్కకు స్వర్గ ప్రవేశం లేదని చెప్పడంతో… అక్కడే ఉండిపోతానని ధర్మరాజు అంటాడు. ఆ తరవాత కుక్క యమధర్మరాజుగా మారి గొప్పతనాన్ని పరీక్షించడానికి వచ్చానని అంటుంది. అయితే పాండవులలో ధర్మరాజు మాత్రమే శరీరంతో స్వర్గం కి వెళ్తాడు.

Previous articleసుప్రీం కోర్టు: ప్రేమ వివాహాలలోనే విడాకులు ఎక్కువ…!
Next articleమీ వైవాహిక జీవితంలో తరచుగా గొడవలు వస్తున్నాయా..? మరి ఈ 6 సూత్రాలు పాటించేయండి..!