శివుడికి అభిషేకం చేయడంలోని అంతరార్ధం ఏమిటో మీకు తెలుసా..? అభిషేకం చేసేటప్పుడు ఈ తప్పులు చెయ్యద్దు..!

Ads

పూజ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. దేవుడిని ఆరాదించేటప్పుడు మనం తప్పు చెయ్యకూడదు. అభిషేకం చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది ఈ రోజుల్లో చాలా మంది తెలియక ఎవరికి నచ్చినట్లు వాళ్ళు అనుసరిస్తున్నారు. ఎప్పుడూ కూడా భగవంతుడిని ప్రార్థించే సమయంలో తప్పులు చేయకూడదు. చాలామంది తెలుసో తెలియకో రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు. అభిషేకం చేయడంలో దాగి ఉన్న అంతరార్థం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం..

కొంత మంది అభిషేకం చేసి తప్పులు చేస్తూ ఉంటారు. అభిషేకానికి సంబంధించి ఎటువంటి తప్పులు చేయకూడదు అనేది తెలుసుకుంటే ఆ తప్పును మళ్ళీ మీరు చేయరు. మన జీవితంలో వచ్చింది ఏదైనా సరే పోతూ ఉంటుంది తప్ప అలా ఉండదు. లైఫ్ లో వచ్చే ప్రతిదీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, అలా నిలకడగా ఏదీ ఉండదు. మనం శివలింగానికి అభిషేకం చేయడం చూస్తూ ఉంటాం.

Ads

లేకపోతే చేస్తూ ఉంటాం. శివలింగానికి అభిషేకం చేసినప్పుడు నీళ్లు జారి కింద పడిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా శివలింగం మీద ఆ నీళ్లు అలా స్థిరంగా ఉండిపోవు. అందుకని కేవలం శివలింగానికి మాత్రమే అభిషేకం చేయాలి. విగ్రహాలకి అభిషేకం చేయకూడదు. విగ్రహాలకి కేవలం పూజ చేయాలి. అది కూడా పూలతో పూజ చేయాలి. శివలింగానికి చేసినట్లు మనం విగ్రహాలకి అభిషేకం చేయరాదు. చాలా మంది పంచ లోహాలు ఉన్నాయని విగ్రహాలకి కూడా అభిషేకం చేసి ఇస్తూ ఉంటారు.

అలా చేయడం తప్పు. ఇష్టం వచ్చినట్లు అభిషేకాన్ని చేయరాదు. జీవితంలో వచ్చిన ప్రతీది కూడా వెళ్ళిపోతుంది. స్థిరంగా ఉండదు. మన దగ్గరికి ఏం వచ్చినా కూడా అది వెళుతుంది కాబట్టి అభిషేకం చేసినప్పుడు కూడా వేసిన ప్రతిదీ కూడా కిందకి జారిపోవాలి. అందుకనే శివుడికి అభిషేకం చేసినప్పుడు నీళ్లతో మాత్రమే అభిషేకం చేస్తాము కాబట్టి అభిషేకం చేసినప్పుడు ఈ విషయాన్ని మీరు తప్పక గుర్తుపెట్టుకోండి.

 

Previous articleఒకటి కంటే ఎక్కువ గణేష్ విగ్రహాలు ఉన్నాయా..? అయితే ఇలా మాత్రం అస్సలు చెయ్యకండి..!
Next articleపబ్బుల్లో ఎందుకు అంత సౌండ్ మ్యూజిక్ పెడతారు..? వామ్మో అదా రీజన్..!