ప్రేమిస్తే హీరోయిన్ సంధ్య ఎలా ఉందో? ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Ads

కొన్ని సినిమాలు తరాలు మారిన కూడా ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలా ఆడియెన్స్ ని బాగా ఆకట్టుకున్న చిత్రాలలో ప్రేమిస్తే మూవీ కూడా ఒకటి. ఈ సినిమాని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా లవ్ స్టోరీ సినిమాలలో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీగా చెప్పుకోవచ్చు. ఈ విషాదమైన లవ్ స్టోరి మూవీకి ఇప్పటికీ కూడా అభిమానులు ఉన్నారు.

Ads

కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ శక్తి వేల్ తెరకెక్కించిన ఈ సినిమాలో భరత్, సంధ్య లవర్స్ గా నటించారు. సంధ్యకు హీరోయిన్‌గా ఇదే తొలి సినిమా. అయితే ఫస్ట్ మూవీ అయినప్పటికి తన అద్భుతమైన నటనతో ఆడియెన్స్ ని కట్టిపడేసింది. ఇక ఈ సినిమా కమర్షియల్ గాను హిట్ అయ్యింది. ప్రేమిస్తే సినిమా తరువాత తెలుగు, తమిళ,మలయాళం, కన్నడ భాషల్లో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి. ఇక అన్ని భాషల్లోనూ కలిపి సంధ్య దాదాపు 40కి పైగా చిత్రాల్లో నటించింది. కొన్ని చిత్రాలలో చెల్లెలి పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. తెలుగులో పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ నటించిన అన్నవరంలో ఆయన చెల్లెలి పాత్రలో నటించింది. ఆ సినిమాలో అమాయకమైన పల్లెటూరి అమ్మాయి క్యారెక్టర్ లో చాలా సహజంగా నటించి మెప్పించింది. ఆ తర్వాత ఆమె సినిమాలు విజయం పొందకపోవడంతో క్రమంగా సిని పరిశ్రమకి దూరమైంది. ఆ తరువాత సంధ్య చెన్నై సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని ప్రేమించి, 2015లో పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి గురువాయూర్ టెంపుల్ లో చాలా సింపుల్ గా జరిగింది.అయితే పెళ్లి తరువాత సంధ్య లుక్ పూర్తిగా మారిపోయింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు సినిమాల్లో నటించిన సంధ్యకు, వియర్ల అవుతున్న ఫోటోలో ఉన్న సంధ్యకు చాలా డిఫరెన్స్ ఉందని అంటున్నారు. ప్రేమిస్తే హీరోయిన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే హీరోయిన్ సంధ్య సామాజిక మధ్యమాలలో కూడా యాక్టివ్ గా ఉండట్లేదు. 2016 సెప్టెంబర్‌లో సంధ్యకి ఒక ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం ఆమె చెన్నైలోనే ఉంటుంది. ప్రస్తుతం ఆమె కుటుంబ జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్‌ చేస్తుందని తెలుస్తోంది. అంతేకాకుండా సంధ్య తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.

Also Read: ఖడ్గం మూవీ కోసం నటుడు షఫీ చార్మినార్ వీధుల్లో చేసిన పని ఏమిటో తెలుసా?

Previous articleరైల్వే స్టేషన్‌ లో తీసుకునే ప్లాట్‌ఫామ్ టికెట్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
Next articleభాను చందర్, సుమన్ కాంబినేషన్ లో వచ్చిన.. 9 సినిమాలు ఇవే..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.