బాల‌కృష్ణ త‌న అభిమానులను కొట్ట‌డం వెనుక ఉన్న కార‌ణం ఏమిటో చెప్పిన స్టార్ రైటర్..

Ads

నంద‌మూరి బాల‌కృష్ణ గురించి తెలుగువారికి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయనవసరం లేదు. ఆయన చాలా జోవియల్ పర్సన్ అని, అలా ఎవరు ఉండరని బాలయ్యని దగ్గర నుండి చూసిన వారు చెప్తారు. అయితే కొన్నిసార్లు బాల‌కృష్ణ కోపాన్ని చూసి భయపడినవారు కూడా ఉన్నారనే చెప్పాలి.

ఆయన ఒకవైపు సినిమాలలో నటుస్తున్నాడు. మరొక వైపు ఎమ్మెల్యేగానూ విధులు నిర్వహిస్తున్నారు. బాలయ్య ప్రజల మధ్యకి వెళ్లినపుడు ఆయన దగ్గరకు అభిమానంతో వచ్చే అభిమానుల పై చేయి చేసుకుంటారని ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. అలా ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా బాలకృష్ణ తన పంథాను మాత్రం మార్చుకోలేదు. అలా ఎందుకు ప్రవర్తిస్తాడనే దాని పై ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయరు.
అయితే ఇదే విషయం గురించి బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి పని చేసిన మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ తెలిపారు. ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బాల‌య్య గురించి ఆసక్తికర విషయాలను తెలియచేసారు. ఫ్యాన్స్ ని కొడతారనే అపవాదుకు నందమూరి బాలకృష్ణ ఎలాంటి వివరణ ఇచ్చారనే విషయాన్ని తెలిపారు. సాధారణంగా హీరోలందరూ బౌన్సర్లను పెట్టుకుంటారు. అలా ఎందుకని పెట్టుకుంటున్నారు? అభిమనులని పక్కకు నెట్టిందుకు, వారిని మీదపడకుండా కొట్టేందుకే కోసమే కదా. లేటెస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చిన చిన్న హీరోలే నలుగురు లేదా ఐదురుగు బౌన్సర్లను పెట్టుకుంటున్నారు.
వారి లాగానే నా అభిమానులను కొట్టడం కోసం, డబ్బులిచ్చి మరి బౌన్సర్లను పెట్టుకోవాలా, అలాంటి పని నేను చేయను. ఇక అభిమానులు తనకు కుటుంబంతో సమానమని, అలాంటి తన ఫ్యామిలీ మెంబర్స్ ని కొట్టేందుకు బౌన్సర్లు ఎవరనేది బాలయ్య ఉద్దేశ్యమని, ఒక‌వేళ నాకు కోపం వస్తే వాళ్ళని ఓ దెబ్బ వేస్తానని, అదే వాళ్లకు కోపం వస్తే నా మీదకు వస్తారని, అంతే కానీ మా మధ్యలో రావడానికి బౌన్సర్లు ఎవరని ఆయన అన్నట్లుగా సాయి మాధవ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ విషయం గురించి బయటకు మాట్లాడ‌డం తనకు ఇష్టం లేదని బాల‌కృష్ణ అన్నారని తెలిపారు.

Ads

Also Read: మెగాస్టార్ చిరంజీవిని సీనియ‌ర్ ఎన్టీఆర్ మూవీ మ‌ధ్య‌లోనే తొలగించారా?

Previous articleఅచ్చం ప్రభాస్ లాగే ఉన్న ఈ ఫోటోలోని వ్యక్తి కూడా ఒక నటుడే.. అతను ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Next articleరోజా జ‌బ‌ర్ద‌స్త్‌ కామెడీ షోని మానేయడానికి కార‌ణం మెగా బ్రదర్ నాగ‌బాబు నేనా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.