Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాకి విజయభాస్కర్ గారు దర్శకత్వం వహించారు. సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికి కూడా ఈ సినిమా డైలాగ్స్ ఎక్కడో ఒకచోట వింటూనే ఉంటాం. సమీరా రెడ్డి, భూమిక చావ్లా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి, మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. తన మేనకోడలు చనిపోవడంతో, ఆ అమ్మాయిని చంపిన వారిని వెతుక్కుంటూ వెళ్లి, వారిపై పగ తీర్చుకునే ఒక వ్యక్తి కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. అయితే మధ్యలో కామెడీ కూడా చాలా యాడ్ చేశారు.
అయితే, ఈ సినిమాలో హీరో మేనకోడలి పాత్రలో నటించిన అమ్మాయి కనిపించేది కొంచెం సేపే అయినా కూడా ఈ సినిమాతో చాలా గుర్తింపు సంపాదించుకుంది. ఆ అమ్మాయి పేరు శ్రియ శర్మ. శ్రియ చాలా ఎడ్వర్టైజ్మెంట్స్ లో నటించింది. హిందీలో ఎన్నో సీరియల్స్ లో నటించింది. తెలుగులో జై చిరంజీవ సినిమాలో నటించింది. ఇదే శ్రియ శర్మ మొదటి సినిమా. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో కూడా హీరోయిన్ చెల్లి పాత్రలో నటించింది.
ఆ తర్వాత రచ్చ సినిమాలో హీరోయిన్ చెల్లిలాగా, తూనీగ తూనీగ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో, గాయకుడు అనే సినిమాలో హీరోయిన్ గా, ఆ తర్వాత నిర్మల కాన్వెంట్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. వీటితో పాటు కొన్ని హిందీ సినిమాల్లో, తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. అందులో కొన్ని ముఖ్య పాత్రల్లో శ్రియ శర్మ నటించిన. అయితే, ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. దాంతో ఈ అమ్మాయి ఎక్కడ ఉంది అని వెతికే వారు ఎక్కువ అయిపోయారు.
ఇప్పుడు సినిమాలకి దూరంగా వేరే వృత్తిలో శ్రియ శర్మ ఎదిగింది. ప్రస్తుతం శ్రియ శర్మ లాయర్ గా పని చేస్తోంది. లా విద్యని అభ్యసించి, ఎన్నో కార్పొరేట్ కంపెనీలకు అడ్వకేట్ గా శ్రియ శర్మ పనిచేస్తోంది. శ్రియ శర్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని కూడా షేర్ చేస్తూ ఉంటుంది. చాలా మంది మధ్యలో బ్రేక్ తీసుకొని మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారు. శ్రియ శర్మ కూడా అలా వస్తుంది ఏమో చూడాలి.
View this post on Instagram
Ads
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
ALSO READ : శ్రీదేవితో ఉన్న ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎవరో తెలుసా.? నలుగురితో కలిసి నటించిన ఒకే ఒక్క హీరో ఎవరంటే?