కాబోయే కోడలి కోసం అంబానీ ఇస్తున్న బహుమతుల లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..! ఏం ఉన్నాయంటే..?

Ads

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఈ క్రమంలోనే కాబోయే కోడలు రాధిక మర్చంట్ కి అంబానీ దంపతులు ఖరీదైన గిఫ్ట్లు అందించారు. వాటిలో కోట్ల రూపాయలు ఖరీదు చేసే కారు, లక్షల విలువైన వెండి, వజ్రభరణాలు ఉన్నాయి.

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి ఒకటి నుంచి మూడు వరకు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అత్తింటి వారు తమ కాబోయే కోడలికి ముందుగానే సుమారు 4.5 కోట్ల విలువచేసే బెంట్లీ కారు, వెండితో చేసిన లక్ష్మీ గణపతి విగ్రహం, డైమండ్ నెక్లెస్ లను గిఫ్ట్ గా ఇచ్చినట్లు సమాచారం.

gifts to ambani daughter in law

Ads

నీతా అంబానీ తనకు కాబోయే కోడలు రాధికా మర్చంట్ కు వెండి లక్ష్మీ గణపతి గిఫ్ట్ హేంపర్ అందించినట్లు తెలుస్తోంది. ఈ గిఫ్ట్ హేంపర్ లో రెండు తులసి సిల్వర్ పాట్స్,ఒక సిల్వర్ స్టిక్ స్టాండ్, ఒక లక్ష్మీ గణపతి విగ్రహం ఉన్నాయి. తెల్లటి పూలు ఇతర నగలతో కలిపి ఈ గిఫ్ట్ హేంపర్ ఉంది. మరొకవైపు రాధికా మర్చంట్ కు బెంట్లీ కారు మనదేశంలోనే చాలా తక్కువ మంది దగ్గర ఉన్నాయి. ఈ లగ్జరీ కార్లు విరాట్ కోహ్లీ, అమీర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ వంటి వారి దగ్గర మాత్రమే ఉన్నాయి.

ముఖేష్ అంబానీ మేనకోడలు ఇషేత సల్గావోకర్ కాక్టెయిల్ పార్టీకి రాధిక మర్చంట్ అద్భుతమైన ముత్యాలు వజ్రాల హారంలో కనిపించారు. ఈ నక్లెస్ తనకు కాబోయే అత్తగారు నీతా అంబానీకి చెందినదిగా సమాచారం. వివాహ కానుకగా తన డైమండ్ చోకర్ ను రాధిక మర్చంట్ కు నీతా అంబానీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సోనం కపూర్ వెడ్డింగ్ రిసెప్షన్ కి నీతా అంబానీ అదే నెక్లెస్ ధరించడం గమనార్హం. అలాగే అంబానీ పెద్దకొడుకు ఆకాష్ అంబానీ 2019లో శ్లోక మెహతాను వివాహం చేసుకున్నప్పుడు ఆమెకి కూడా 450 ఒక కోట్ల విలువైన నెక్లెస్ ను బహుమతిగా ఇవ్వడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది.

Previous articleఇవాళ జరగనున్న వైయస్ షర్మిల కొడుకు రిసెప్షన్ కి హాజరు కాబోతున్న ప్రముఖులు వీరే..! ఎవరెవరు ఉన్నారంటే..?
Next articleనాని ప్రేమ కథ గురించి తెలుసా..? అన్ని సంవత్సరాలు వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.