కార్లు మీద lxi,vxi,zxi,vdi అని ఎందుకు ఉంటాయి..? అర్ధం ఏమిటో తెలుసా..?

Ads

చాలామంది ఎక్కువ కంఫర్ట్ గా ఉంటుందని కార్లలో ట్రావెల్ చేస్తూ ఉంటారు. రకరకాల కార్లు ని కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. చాలామందికి కార్ల గురించి అన్ని విషయాలు తెలియవు. కార్లకి సంబంధించి విషయాలు తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది మనం చూసినట్లయితే నిత్యం రకరకాల కార్లు కనబడుతూ ఉంటాయి.

అయితే ఎప్పుడూ వాటి మీద ఉండే అక్షరాలని మనం గమనించి ఉండకపోవచ్చు. కార్లు అనేక రకాల అక్షరాలతో కేటగరైజ్ చేయబడి ఉంటాయి అయితే అక్షరాలు ఎందుకు రాయబడి ఉంటాయి..? వాటి వెనక కారణం ఏమిటి..?

వాటి వలన ఏదైనా ఉపయోగం ఉందా లేదా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం…కార్ల లో మోడల్స్ ఉంటాయి. కారు lxi, vxi, zxi మోడల్ అని వింటాం. ఇక ఈ అక్షరాలా వెనుక అర్ధం ఏమిటి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం.

Ads

బేసిక్ మోడల్:

Lxi & LDi (L) అనేది బేసిక్ మోడల్. బేసిక్ ఫీచర్స్ తో తయారు చేసిన వెహికిల్ ఇది. X అంటే పెట్రోల్ ని సూచిస్తోంది. D అంటే డీజిల్ అని. i అన్నింటికి కామన్ గా ఉపయోగించబడే సింబల్. V అంటే మీడియం లెవెల్ అని అర్ధం. బేసిక్ కంటే ఎక్కువ టాప్ కంటే తక్కువ.

టాప్ మోడల్:

ZXi &ZDi లో చూస్తే.. ఈ Z అనేది టాప్ మోడల్ అని అర్థం. టాప్ ఎండ్ అంటే అత్యాధునిక ఫీచర్స్ ను కలిగి వున్నది అని ఇలా రాస్తారు. ఇక X అంటే పెట్రోల్ వెహికిల్. అదే D అంటే డీజిల్ వెహికిల్. అదే విధంగా i అన్నింటికి కామన్ గా వాడే సింబల్. ఇలా షార్ట్ కట్ లో ఈ అక్షరాలని రాస్తారు.

L = బేసిక్ ఫీచర్స్, V = మీడియం లెవల్ ఫీచర్స్, Z = టాప్ ఎండ్ అంటే అత్యాధునిక ఫీచర్స్,
XI పెట్రోల్ వెహికిల్, DI డీజిల్ వెహికిల్.

Previous articleచెక్కుపై డబ్బులు రాసి చివర్లో ”ONLY” అని ఎందుకు రాస్తారు…?
Next articleఫోన్‌లో నెట్‌వర్క్ లేకపోయినా.. ఎమర్జెన్సీ కాల్స్ ఎలా వెళ్తాయి..?