చాట్‌జీపీటీని లవర్స్ ఈ రకంగా కూడా వాడేస్తున్నారంట..!

Ads

ఈమధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు చాట్ జీపీటీ. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తుంది. అతి తక్కువ కాలంలోనే చాలా పాపులర్ అయ్యింది. ప్రేమికుల రోజు సందర్భంగా చాట్‌జీపీటీని లవ్‌బర్డ్స్‌ కూడా ఉపయోగించుకుంటున్నారు.

Ads

తమ ప్రేయసిని ఇంప్రెస్‌ చేయడం కోసం చాట్‌జీపీటీ సహాయాన్ని అబ్బాయిలు తీసుకుంటున్నారట. లవ్ లెటర్స్ రాయడానికి ఇండియాలోని పురుషులు మరియు టీనేజర్లు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాయం తీసుకుంటున్నారని తాజాగా చేసిన ఒక అధ్యయనంలో తెలిసింది. అంతేకాకుండా డెబ్బై మూడు శాతం మంది తమ ప్రొఫైళ్లను డేటింగ్ యాప్‌లలో మార్చుకోవడానికి చాట్ జీపీటీని వాడుకోవాలని చూస్తున్నారట.
ప్రేమించినవారిని ఎలాగైనా ఆకర్షించాలని 60 శాతం కన్నా ఎక్కువగా ఇండియన్స్ ఈ ప్రేమికుల రోజూ సందర్భంగా లవ్ లెటర్స్ రాసేందుకు ఏఐ టూల్ సాయం తీసుకోవాలనుకున్నారని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ అయిన మెకాఫీ తెలిపింది. ‘మోడరన్ లవ్’అనే పేరుతో జరిపిన సర్వేలో 78 శాతం మంది ఇండియన్స్ చాట్‌జీపీటీలో రాసిన లవ్ లెటర్స్ ను ఇష్టపడుతున్నారని, ఇంకా చెప్పాలంటే దానిని చాట్‌జీపీటీలో రాసిన లేఖగా గుర్తించలేకపోతున్నారని మెకాఫీ అధ్యయనంలో తేల్చింది. అంతేకాకుండా లవ్ లెటర్స్ రాయడానికి ఈ టూల్ ను వాడిన 8 దేశాలలో ఇండియన్స్  ఎక్కువమంది ఉన్నారని తెలిపింది.
తమ లవ్ ను వ్యక్తం పరచడానికి మాటలు రానివారు, లవ్ లెటర్స్ రాయలేనివారు లేదా దానికి రాయడానికి పదాలు దొరకని వారు చాట్‌జీపీటీని ఆశ్రయిస్తున్నారంట. ప్రేమికుల రోజు సందర్భంగా నిర్వహించిన ‘మోడరన్ లవ్‌’ అధ్యయనంలో తొమ్మిది దేశాల నుండి దాదాపు 5000 మందికి పైగా సర్వే చేసింది. 27 శాతం మంది చాట్‌జీపీటీ లెటర్ ను పంపడం వల్ల మరింత ఆత్మవిశ్వాసం వచ్చిందని ఆ రిపోర్ట్‌లో తెలిపారు. 49శాతం మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ రాసిన లవ్ లెటర్ లు అందుకోవడం పై అసంతృప్తి తెలియచేసారు.
చాట్‌జీపీటీ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌కు షాకిస్తూ ఈమధ్య కాలంలో దూసుకుపోతోంది.దీంతో గూగుల్‌ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ చాట్‌ జీపీటీకి పోటీగా ఏఐటూల్ బార్డ్‌ను తెచ్చింది. అయితే ఇందులో జరిగిన ఒక తప్పిదం కారణంగా బార్డ్ భవిష్యత్తులో చాట్‌జీపీటీతో పోటీ పడడం అనేది చర్చకు దారి తీసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరి కన్నా ఎక్కువ మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాయంతో నోట్‌ను రాయాలని చూస్తున్నారు.ఇక ఆన్‌లైన్ డేటింగ్ వరల్డ్ లో ఏఐ రెండు వైపులా పదునైన కత్తి వంటిదని మెకాఫీ హెచ్చరించింది. దీనివల్ల సైబర్ నేరగాళ్లు లవర్స్ ను టార్గెట్‌ చేసే అవకాశం ఉందని, మనుషులకు ఏఐకు మధ్య ఉన్న తేడాను గుర్తించగలర లేదా అనేది అర్థం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనదని తమ నివేదికలో తెలిపింది. అలాగే తమ పార్ట్‌నర్‌తో మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని, మరి ముఖ్యంగా డబ్బుల గురించి, పర్సనల్ వివరాల గురించి అడిగినప్పుడు అనుమానాస్పదంగా అనిపించినపుడు, అప్రమత్తంగా ఉండాలని బమెకాఫీ స్టీవ్ గ్రోబ్‌మాన్ తెలిపారు.

Also Read: మీ మొబైల్ ఫోన్‌ని ఉపయోగించి హోటల్ రూమ్ లో ఉండే సీక్రెట్ కెమెరాలను ఎలా కనుగొనాలో తెలుసా?

Previous articleఆనాడు బాలయ్య, చిరంజీవి గురించి… అన్నగారు చెప్పింది నిజం అయ్యిందిగా..!
Next articleఎందుకు ”బాలయ్య” ఆ తప్పు చేసారు..? బాబాయ్, అబ్బాయ్ మధ్య అసలు ఏం జరిగింది..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.