ఆనాడు బాలయ్య, చిరంజీవి గురించి… అన్నగారు చెప్పింది నిజం అయ్యిందిగా..!

Ads

అశ్విని దత్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అశ్విని దత్ చాలా సినిమాలని ఎంతో మంది టాప్ హీరోలతో తీసుకు వచ్చారు తెలుగులో భారీ చిత్రాలని నిర్మించారు అశ్విని దత్. అశ్విని దత్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది వైజయంతి మూవీస్. వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్. ఈయన టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలతో పని చేశారు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా నిర్మించారు.

ఈ తరం హీరోలే కాదు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణం రాజు, కృష్ణ, శోభన్ బాబు ఇలా చెప్పుకుపోతే చాలా మంది హీరోలతో ఈయన సినిమాలని నిర్మించడం జరిగింది.

అశ్విని దత్ మొదట విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ”ఓ సీత కథ” సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేశారు. ఇలా తన కెరీర్ ని ప్రారంభించారు అశ్విని దత్. అశ్విని దత్ కి అన్నగారు అంటే ఎంతో ఇష్టం. ఆయనతో ఒక సినిమాను చేయాలని అనుకున్నారు. ప్రొడక్షన్ హౌస్ యొక్క లోగో లో ఎన్టీఆర్ శ్రీకృష్ణ భగవానుడులా ఉన్న ఫోటో ఉంటుంది. చిరంజీవితో కూడా ఈయన ఎక్కువ సినిమాలు చేశారు చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర, చూడాలని ఉంది వంటి బ్లాక్ బస్టర్ సినిమాలని రూపొందించడం జరిగింది.

Ads

బాలకృష్ణతో కూడా ఈయన మంచి సినిమాలు చేశారు. అయితే ఒకసారి షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన ఇది. అదేంటంటే ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో చిరంజీవి ఖైదీ, అడవి దొంగ, పసివాడి ప్రాణం వంటి సినిమాలు తెర మీదకి వచ్చాయి మంచి హిట్ ని కూడా అందుకున్నారు చిరు. ఇక బాలకృష్ణ విషయానికి వస్తే బాలకృష్ణ అనసూయమ్మ గారి అల్లుడు, మువ్వా గోపాలుడు, మంగమ్మగారి మనవడు లాంటి సినిమాలు చేసి హిట్ అందుకున్నారు.

దాంతో చిరంజీవి గురించి బాలకృష్ణ గురించి అల్లు రామలింగయ్య అన్నగారు ముచ్చటించుకున్నారు. తర్వాత సినీ పరిశ్రమ మీ అల్లుడు చిరంజీవి మా కొడుకు బాలయ్యదే అని ఎన్టీఆర్ అన్నారట. ఆనాడు ఎన్టీఆర్ చెప్పినట్లే ఇప్పుడు జరిగింది అని అశ్వని దత్ అన్నారు. చిరంజీవి బాలకృష్ణ కూడా మంచి హిట్లతో దూసుకు వెళ్తున్నారు. చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నారు. మొన్న వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా కూడా చిరంజీవికి మంచి హిట్ ని ఇచ్చింది.

Previous articleకీరవాణి కి ఆ పేరు పెట్టడానికి వెనుక… ఇంత పెద్ద కారణమా..? అందుకే ఇలా…!
Next articleచాట్‌జీపీటీని లవర్స్ ఈ రకంగా కూడా వాడేస్తున్నారంట..!