సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లోని చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!

Ads

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. మహేష్ బాబు వెంకటేష్ ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో నటించారు. 2013 లో ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు, అంజలి, సమంత, ప్రకాష్ రాజ్, జయసుధ, రావు రమేష్, కోట శ్రీనివాసరావు తదితరులు నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి పాటల్ని అందించారు ఈ సినిమాని ఎంతో అందంగా తెర మీదకి తీసుకొచ్చారు.

ఈ సినిమాలో సన్నివేశాలని హైదరాబాద్ తో పాటు ఆంధ్రప్రదేశ్లో కోస్తాలో చిత్రీకరించడం జరిగింది. మంచి కుటుంబ కథా చిత్రం ఇది. ఈ సినిమాలో ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నటించింది. ఆమె మీకు గుర్తుందా..? పక్కా గుర్తుండే ఉంటుంది కేవలం ‘ఏంటి కూల్ ఎక్కలేదా వాటర్’ అని గోదారి యాసలో చెప్పిన ఒక్క డైలాగ్ తో ఆ చిన్నారి ఫేమస్ అయిపోయింది.

Ads

నిజానికి కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంతో కష్టపడక్కర్లేదు ఇలా ఒక డైలాగ్ తో ఫేమస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ చిన్నారి కూడా ఈ ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఆ తర్వాత మళ్లీ ఇంకో సినిమాలో కనపడకపోయినా ఆమె అందరికీ బాగా గుర్తుండిపోయింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంత ఫ్యామిలీతో పాటుగా ఈ చిన్నారి కనబడుతూ ఉంటుంది. రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు ‘ఏంటి కూల్ ఎక్కలేదా వాటర్’ అని ఆమె అంటుంది.

గోదారి యాసలో ఈమె ఒక్క డైలాగ్ చెప్పి అందరిని ఆకట్టేసుకుంది. ఇక ఆమె ఎవరంటే.. ఆమె పేరు రచన. 2019లో రచన పెళ్లి అయింది 2020లో ఆమెకి పాప పుట్టింది. ఇప్పుడు రచన తన భర్తతో పాటు సింగపూర్ లో వుంది. రచన సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది రీల్స్ చేయడంతో పాటుగా ఫ్యామిలీ ఫోటోలని కూడా పంచుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట షికార్లు కొడుతున్నాయి 10 ఏళ్లలో రచన ఏంటి ఇలా మారిపోయింది అని అంతా షాక్ అవుతారు.

Previous articleడ్రింక్ బాటిల్స్ అడుగున బొడుపులు ఎందుకు ఉంటాయి..? కారణం ఏంటో తెలుసా..?
Next articleనాగార్జున తో నాగేశ్వర రావు అంత స్ట్రిక్ట్ గా ఉండేవారా..?