రోజుకు ఒక ట్విస్ట్.. గంటకు ఒక గాసిప్…విడుదలకు ముందే ఇంట్రెస్టింగా మారుతున్న కల్కీ మూవీ..

Ads

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్టు కె చిత్రం కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ గ్లింప్స్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టించడంతో పాటు ఇపటికి 7.3 మిలియన్ల వ్యూస్ తన ఖాతాలో వేసుకుంది. ప్రతి గంటకు వ్యూస్ పెరుగుతున్నాయే తప్ప.. తగ్గేదే లేదు అన్నట్టు ఉంది ఈ మూవీ వ్యవహారం. అయితే ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై పలు రకాల కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అందులో ముఖ్యంగా ప్రస్తుతం అమితాబచ్చన్ రోల్ గురించి ఒక న్యూస్ నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ మూవీలో అమితాబచ్చన్ మరియు ప్రభాస్ కాంబినేషన్లో సీన్లు ఉండవని.. అమితాబ్ రోల్ చనిపోయిన తర్వాతే ప్రభాస్ పాత్ర మొదలవుతుందని ఒక టాక్ వినిపిస్తోంది. ఇండియన్ సూపర్ హీరో రేంజ్ లో ఉన్న ప్రభాస్ లుక్స్ ఈ మూవీలో బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఆది పురుష్ మూవీ కలిగించిన నిరాశ ఈ చిత్రంతో దూరం అవుతుందని ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నారు.

Kalki 2898

Ads

మరోపక్క ఈ చిత్రం బడ్జెట్ కు న్యాయం చేసి.. ఆడియన్స్‌ను ఎన్నో ట్విస్టులతో ఆద్యంతం అలరిస్తుంది అని సినీ వర్గాల సమాచారం. లెంత్ ఎక్కువైన కారణంగా ఈ చిత్రాన్ని ఇప్పటికే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు అన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. అయితే ఈ విషయంపై ఇంతవరకు నాగ అశ్విన్ మరియు అతని టీం ఎటువంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు.

ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేసే టైంలో రానా అక్కడ ఉండడంతో ఈ మూవీలో రానాకి కూడా ఒక స్పెషల్ రోల్ ఉంది అని మరో పుకారు బయలుదేరింది. ఇందులో ప్రభాస్ వేరే గ్రహానికి వెళ్తాడు అని కూడా కొందరు అంటున్నారు. అది కాక ఇందులో కమల్ హాసన్ ఎక్కడ అని రానా స్టేజ్ పైన అడగడం మరో కొత్త డౌట్ ని లేవనెత్తింది. వీడియో మొత్తం కమల్ హాసన్ ఉన్నాడు కానీ కనిపించడు అని నాగ అశ్విన్ దానికి ఇచ్చిన రిప్లై మరింత ఆసక్తికరంగా ఉంది. రోజురోజుకీ ఒక అందమైన పొడుపు కథలా మారుతున్న ఈ కల్కి చిత్రం గుట్టు విడుదల తర్వాతే అందరికీ తెలుస్తుంది.

Previous articleప్రాజెక్ట్ కె టైటిల్ వెనుక అసలు ట్విస్ట్ ఇదన్నమాట..!
Next articleటాలీవుడ్ లోని ఈ 10 మంది స్టార్ హీరోల పెళ్లి పత్రికలూ ఎప్పుడైనా చూసారా?