మజిలీ సినిమాలో ఉన్న ఈ మిస్టెక్ ను ఎప్పుడైనా గమనించారా?

Ads

అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన సినిమా మజిలీ. ఈ సినిమా 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీని హరీష్ పెద్ది,సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో నిర్మించారు. దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు.

Ads

నాగచైతన్య, సమంత పెళ్లి జరిగిన తరువాత ఈ సినిమాలో తొలిసారి కలిసి నటించడంతో సినిమా అనౌన్స్ చేనప్పటి నుండే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఇక సినిమాపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఆడియెన్స్ అంచనాలను తగ్గట్టుగానే మజిలీ సినిమా విడుదలయి ఘన విజయం సాధించింది. ఇకపోతే ఏ మూవీ అయినా, రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలు గడిచిన తరువాత కూడా ఎప్పుడో ఒకసారి ఆ సినిమాలోని ఏదో ఒక విషయం వల్ల సోషల్ మీడియాలోకి వస్తూనే ఉంటుంది.ఇక అలానే మజిలీ మూవీలోని ఓ విషయం వల్ల తాజాగా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ విషయం ఏంటి అంటే, ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ పార్ట్ తరువాత పూర్ణ(నాగచైతన్య), అతని ప్రేయసి అన్షు కుమార్తె మీరాను క్రికెట్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం వైజాగ్ లో ఉన్న వాళ్ళింటికి తీసుకెళ్తాడు. మీరా నాగచైతన్య ఇంటికి వచ్చకా ఫ్రెషప్ అవడానికి వెళ్ళి మీ బాత్రూంలో షవర్ లేదా అని అడగడంతో శ్రావణి(సమంత) ఉంది. ప్రస్తుతం పని చేయడం లేదు అంటుంది.
అయితే ఆ తరువాత వచ్చే ఒక సన్నివేశంలో సమంత షవర్ కింద ఉన్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విషయం పై నెట్టింట్లో మీమ్ వచ్చింది. దానికి నెటిజన్లు స్పందిస్తూ ఆ తర్వాత రిపేర్ చేయించారేమోలే అని కామెంట్స్ పెడుతున్నారు. నాగచైతన్య, సమంత ఏ మాయ చేశావే, మనం,ఆటోనగర్ సూర్య సినిమాల  తరువాత కలిసి నటించిన  సినిమా మజిలీ. ఈ సినిమాకు మరో అట్రాక్షన్ గోపీసుందర్ అందించిన సంగీతం. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అందించారు. 

Also Read: నన్ను ఇండస్ట్రీ బ్యాన్ చెయ్యలేదు.. రష్మిక మందన

Previous articleటాలీవుడ్ లో ఎక్కువ రీమేక్ సినిమాలు చేసిన 9 మంది హీరోలు వీరే.. !
Next article2022లో ఓవర్సీస్ లో వన్ మిలియన్ వసూల్ చేసిన సినిమాల లిస్ట్..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.