మెగాస్టార్ చిరంజీవి, సురేఖ పెళ్లి ఫోటోలు, శుభలేఖ వైరల్…మీరు చూసారా..?

Ads

సినిమాల్లోకి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా మీద ఇంకో సినిమా వస్తూనే ఉంది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లో ఈ పొజిషన్ లోకి రావడానికి ఎంతగానో కష్టపడ్డారు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా చిరంజీవి సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి కష్టపడి మంచి పేరు సంపాదించుకున్నారు. పైగా చిరంజీవి చాలా మంది హీరోలకి ఇన్స్పిరేషన్. ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని స్వయంకృషితో చిరంజీవి చిత్ర పరిశ్రమ లో తనకంటూ ఒక పేజీని రూపొందించుకున్నారు. చిరంజీవి నటించిన మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు. ఈ సినిమాతో చిరు పరిచయం అయ్యారు.

కానీ కెమెరా ముందు మొదట నటించిన సినిమా పునాదిరాళ్లు. ఏది ఏమైనా తన డాన్స్ తో నటన తో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకోగలిగారు మెగాస్టార్. మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖను ఫిబ్రవరి 20, 1980 లో పెళ్లి చేసుకున్నారు.

Ads

చిరంజీవి పెళ్లి శుభలేఖని మీరు ఎప్పుడైనా చూసారా..? ప్రస్తుతం సోషల్ మీడియా లో అది వైరల్ గా మారింది. చిరంజీవి సురేఖ పెళ్లి సమయంలో నూతన ప్రసాద్ తో కలిసి చిరంజీవి తాతయ్య ప్రేమ లీలలు సినిమాలో నటించారు.

ఆ సినిమా షూటింగ్ అప్పుడు షర్ట్ చిరిగిపోయింది ఇంకో చొక్క మార్చుకుంటే సమయం అయిపోతుంది అని చిరంజీవి పెళ్లి మండపానికి చిరిగిపోయిన చొక్కా తో వెళ్లారు. చిరిగిన ఆ చొక్కాతోనే సురేఖ మెడ లో తాళి కట్టారు చిరంజీవి. చిరంజీవి పెళ్లి ఫోటో, శుభలేఖ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆ ఫోటోలని ఒక లుక్ వేసేయండి.

Previous articleటెస్టు క్రికెట్‌ ఆడే సమయంలో ఆటగాళ్లు తెలుపు రంగు జెర్సీలనే ఎందుకు ధరిస్తున్నారు?
Next articleమొబైల్ నెంబర్ కి 10 అంకెలు మాత్రమే ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా?