మొబైల్ నెంబర్ కి 10 అంకెలు మాత్రమే ఉండడానికి గల కారణం ఏమిటో తెలుసా?

Ads

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు ఎక్కువగా వినియోగించబడుతున్నాయి. ఈ ఆధునిక కాలంలో మనిషికి ఊతమివ్వడంలో మొబైల్ ఫోన్‌లు ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయి. ఇక ఇప్పుడు ప్రపంచం అంతా ఒక ఉమ్మడి కుటుంబంగా మారిందని చెప్పవచ్చు. మొబైల్ ఫోన్లు ప్రస్తుతం మనుషుల మధ్యన ఉన్న బౌతిక దూరాన్ని చెరిపివేసి చాలా దగ్గర చేశాయి.

Ads

భౌగోళికమైన దూరాలను తొలగించడానికి మొబైల్ ఫోన్లు చాలా పనిచేశాయి. ఇవి అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఎక్కడో ఏదో దేశంలో ఉన్న దూరపు బంధువులతో కూడా గంటల తరబడి మాట్లాడే మార్గం ఏర్పడింది. అయితే, ఇద్దరు వ్యక్తులు మొబైల్ ఫోన్లలో మాట్లాడుకోవాలి అంటే ఒకరు మరొకరి మొబైల్ నంబర్ కి డయల్ చేస్తాం. ఆ నంబర్ పది అంకెలలో ఉంటుంది. మరి ఎప్పుడైనా ఇండియాలో ఫోన్ నంబర్లు 10 అంకెలతో ఎందుకున్నాయనే సందేహం మనలో చాలా మందికి వచ్చి ఉంటుంది కదా. మరి అలా పది  అంకెలు ఎందుకున్నాయి అనేదాని గురించి చూద్దాం.
2003 వరకు కూడా భారత దేశంలో మొబైల్ ఫోన్ల‌కు తొమ్మిది అంకెలు మాత్రమే ఉండేవి. దేశంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI ) తొమ్మిది నెంబ‌ర్ల‌ను పది నెంబ‌ర్ల‌కు పెంచింది. దీనికి కార‌ణం ఏమితి అంటే ఎన్ ఎన్ పి (NNP). అంటే నేషనల్ నంబరింగ్ స్కీమ్ (National Numbering Scheme).
దేశంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రికి కూడా నెంబ‌ర్ ను కేటాయించాల‌నే ఉద్దేశంతోనే మొబైల్ నెంబ‌ర్ ల‌ను 10 అంకెలు ఉండేటట్టు సెట్ చేశారు. ఇక ఈ లెక్క ప్ర‌కారం వెయ్యి కోట్ల విభిన్నమైన మొబైల్ నెంబ‌ర్ ల‌ను త‌యారుచేసుకోవచ్చు. రాబోయే కాలంలో మొబైల్ నెంబ‌ర్ వినియోగం ఎంతగా పెరిగినా కూడా ఈ పద్దతి ద్వారా ఇబ్బందులు రాకుండా చూడవచ్చు.

Also Read: అక్కడ పావురాలకి ఆహారం వేయడం తప్పు..ఇంకో దగ్గర హై హీల్స్ వేసుకోకూడదు… 6 అయితే మరీ తమాషాగా వుంది చూడండి..!

Previous articleమెగాస్టార్ చిరంజీవి, సురేఖ పెళ్లి ఫోటోలు, శుభలేఖ వైరల్…మీరు చూసారా..?
Next articleటాలీవుడ్ లో సర్జరీ చేయించుకున్న10 మంది స్టార్ హీరోయిన్స్..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.