సినిమా టిక్కెట్ రేట్లు పెంచ‌మ‌న్న దాసరికి… ఎన్టీఆర్ చెప్పిన జవాబు ఇది..!

Ads

దాసరి నారాయణరావు దర్శకుడు, రచయిత, నిర్మాత, రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. ఎక్కువ చిత్రాలకి దర్శకుడుగా గిన్నిస్ బుక్ రికార్డులకి ఎక్కారు. దాదాపు 150 చిత్రాలకు దర్శకత్వం వహించారు దాసరి. అలానే 250 కి పైగా చిత్రాలలో సంభాషణ రచయితగా, గీత రచయితగా పనిచేశారు. కేవలం వట్టి తెలుగు భాషలోనే కాక తమిళ కన్నడ భాషల్లో కూడా చిత్రాలు చేసారు దాసరి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ నటుడిగా కూడా బహుమతిని పొందారు. 1974లో తాతా మనవడు సినిమాకి నంది అవార్డు వచ్చింది.

అలానే మేఘసందేశం, స్వర్గం నరకం వంటి చిత్రాలకు కూడా నంది అవార్డు వచ్చింది. నిజంగా మన దేశం గర్వించదగ్గ దర్శకులలో ఈయన కూడా ఒకరు. టాలీవుడ్ లో ఈయన చక్కటి పేరుని పొందారు. బ్లాక్ బస్టర్ ని కూడా అందించారు. అయితే దాసరి ఒకసారి ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు కోరిక కోరారు. సినిమా పరిశ్రమ నుండి ప్రతినిధి వర్గం ఆయన దగ్గరకు వెళ్ళగా దాసరి నారాయణరావు గారు కీలకంగా ఉన్నారు. సమస్యని ఎన్టీఆర్ గారితో చెప్పారు. ఎగ్జిబిటర్లు ఇబ్బందుల్లో ఉన్నారు అని అడిగారు.

Ads

దానికి ఎన్టీఆర్ గారు ఆరు సినిమా హాల్స్ నాకు ఉన్నాయి.. నాకంటే పెద్ద ఎగ్జిబిటార్ ఎవరైనా ఉన్నారా.. బాధపడుతున్నారా అటువంటి వాడిని పట్టుకు రండి అని చెప్పారట. అప్పుడే మాట వింటాను అని దాసరి నారాయణరావు గారిని ఎన్టీఆర్ పంపించేశారు. ఎన్టీఆర్ పెట్టిన స్లాబు పద్ధతి రాజశేఖర్ రెడ్డి వచ్చినప్పుడు తొలగించారు. 70 రూపాయలుగా బాల్కనీ టికెట్ రేటు ఉంటే దానిని 50 కి రాజశేఖర్ రెడ్డి తగ్గించారు.

అలానే ఒక సారి ఎన్టీఆర్ కి దాసరి నారాయణరావు మీద కోపం వచ్చిందట. బొబ్బిలి పులి షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ ఉదయం 7 గంటల లోపు మొదటి షార్ట్ పూర్తి అవ్వాలని అనుకున్నారు కానీ అలా కుదరకపోవడంతో దాసరి తీరు చూసి ఆగ్రహానికి గురైన ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిపోయారు. అప్పుడు సెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారట.

Previous articleతారకరత్నకు ”9” ఎందుకు కలిసి రాలేదు… కారణం ఏమిటి..?
Next articleడబ్బుల కోసం రేణుక… అమ్మాయిల పిచ్చితో ప్రవీణ్… పక్కా ప్లాన్ తో…