డబ్బుల కోసం రేణుక… అమ్మాయిల పిచ్చితో ప్రవీణ్… పక్కా ప్లాన్ తో…

Ads

ఎంతో కష్టపడి పరీక్షలకి ప్రిపేర్ అవుతూ వుంటారు అంతా కానీ కొందరు అడ్డదారులు తొక్కుతూ వుంటారు. కష్టపడి చదువుకోవాలి తప్ప అడ్డదారులులో వెళితే ఈరోజు కాకపోతే రేపు అయినా దొరికిపోతారు. అందులో సందేహమే లేదు. ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నాప్రతాల లీకేజీ విషయంలో కొన్ని విషయాలు బయట పడ్డాయి.

ఈ వ్యవహారంలో సూత్రధారి రేణుక అని తెలుస్తోంది. ఆమె పక్కాగా ప్లాన్ చేసి క్వశ్చన్ పేపర్స్ ని లీక్ చేసిందని తెలుస్తోంది. ప్రవీణ్ కి ఉన్న అమ్మాయిల బలహీనతని రేణుక ఉపయోగించుకుంది.

2011లో రేణుక టెన్త్ పరీక్ష రాసింది తర్వాత కొన్ని కోర్సులు చేసింది 2018 లో హిందీ పండిట్ గా ఆమెకి ఉద్యోగం వచ్చింది. వనపర్తి జిల్లా బుద్ధారంగంలో ఉన్న గురుకుల పాఠశాలలో ఆమె పని చేస్తోంది. ఈమె ఉద్యోగం కోసం అప్పటిలో దరఖాస్తు చేసుకునేటప్పుడు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చేది. అక్కడ ఓటిపి కి సంబంధించిన విషయాలని ప్రవీణ్ తో మాట్లాడేది. ఇలా ప్రవీణ్ తో ఆమెకి స్నేహం ఏర్పడింది.

Ads

2017 నుండి కూడా ప్రవీణ్ టీఎస్పీఎస్ అధికారులతో మంచిగా ఉండేవాడు. అయితే అతనికి అమ్మాయిల బలహీనత ఉంది. రేణుకకి రాజేశ్వర్ అనే ఒక బ్రదర్ ఉన్నాడు. అతను టిటిసి పూర్తి చేశాడు. ఉద్యోగం రావాలని రేణుక అనుకుంది. తమ్ముడు కోసం ప్రశ్న పత్రాన్ని లీక్ చేయాలని అనుకుంది ప్రవీణ్ ని కలిసి రేణుక ప్రశ్నపత్రాలని అడిగింది. తమ్ముడు కోసం సంపాదించిన ఆ క్వశ్చన్ పేపర్స్ తో లక్ష రూపాయలని కాజేస్తుంది. ఈ పేపర్స్ లీక్ చేసే విషయంలో ఈమె పక్క ప్లాన్ చేసింది.

మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన కొందరు యువకులతో ఈమె మాట్లాడి 14 లక్షల కి ప్రశ్నపత్రాలని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఈమె ఈ పని మీద పదహారు రోజులు లీవ్ తీసుకుంది. సీవోఈ ప్రవేశ పరీక్షలో ఇన్విజిలేటర్ గా రావాలన్న కూడా ఆమె రాలేదు. అలానే ఆమె త్వరలో నిర్వహించనున్న టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పోస్టుల రాత పరీక్షకు కూడా ముందే లీవ్ పెట్టేసింది. రేణుకను సస్పెండ్‌ చేస్తున్నట్టు గురుకుల సొసైటీ వర్గాలు అంటున్నాయి.

ఇక ప్రవీణ్‌ విషయానికి వస్తే.. తన ఫోన్‌లో వంద మందికి పైగా అమ్మాయిల నంబర్లు వున్నాయట. అంతే కాక ఫోన్ లో 42 మంది మహిళల అర్ధనగ్న, నగ్న ఫొటోస్ వీడియోస్ కూడా వున్నాయట. ఆ వీక్ నెస్ ని రేణుక వాడుకుందని టాక్. బేరసారాలు అవ్వక ప్రవీణ్, రేణుక, ఔటర్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి చేతికి చిక్కారు. థ్రిలింగ్ కోసం రాజశేఖర్ ఒప్పుకుని లీక్ చేసారని తెలుస్తోంది. ఇలా వీరి ముగ్గురు కూడా ప్లాన్ చేసి లీక్ చేసారు.

Previous articleసినిమా టిక్కెట్ రేట్లు పెంచ‌మ‌న్న దాసరికి… ఎన్టీఆర్ చెప్పిన జవాబు ఇది..!
Next articleఅప్పట్లో పూట గడవడమే కష్టంగా ఉండేది… రాజమౌళి కుటుంబం ఇన్ని కష్టాలు పడ్డారా..?