పిల్లల ముందు తల్లిదండ్రులు ఈ 5 పనులు అస్సలు చేయకూడదు..!

Ads

తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తే పిల్లలు కూడా వాటినే నేర్చుకుంటారు. అలానే వాటినే చేస్తూ ఉంటారు. అందుకని పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే పిల్లలు కూడా తప్పుదారిలో వెళ్లే అవకాశం ఉంది. చాలా మంది ఇళ్లల్లో తల్లిదండ్రులు కొట్టుకుంటూ ఉంటారు. అలా కొట్టుకోవడం వలన పిల్లలు ఎఫెక్ట్ అవుతూ వుంటారు. పైగా పిల్లలు పెద్దలను చూసి నేర్చుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు పిల్లలు ముందు కొట్టుకోవడం వంటివి చేయకూడదు.

పిల్లలు ముందు తల్లిదండ్రులు అస్సలు చేయకూడని పనులు గురించి ఇప్పుడు చూద్దాం. ఇలా కనుక తల్లిదండ్రులు అనుసరించారంటే పిల్లలు కూడా తప్పు త్రోవ పడతారు.

#1. సరిగ్గా ప్రవర్తించకపోవడం:

పిల్లల ముందు తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా సరిగ్గా ప్రవర్తించాలి. తప్పుగా ప్రవర్తించకూడదు. భార్య భర్త పిల్లల ముందు అసభ్యకరమైన పనులు అస్సలు చేయకూడదు.

#2. తప్పుడు పదాల్ని వాడకూడదు:

Ads

చిపిల్లలు తల్లిదండ్రులు, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు ఎలాంటి పదాలను ఉపయోగిస్తున్నారు అనేది చూసి వాటిని పిల్లలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ తప్పుడు పదాలని ఉపయోగించకూడదు.

#3. క్రమశిక్షణ లేకపోవడం:

ఇంట్లో ఉండే వాళ్ళు, తల్లిదండ్రులు క్రమశిక్షణ తో ఉంటే పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉంటారు.

#4. అబద్ధం ఆడడం:

చాలా మంది తల్లిదండ్రులు అబద్ధాలు చెబుతూ ఉంటారు దాని వలన పిల్లలు కూడా అదే త్రోవ పట్టే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు అబద్ధాలు చెప్పరాదు.

#5. అవమానించడం:

భార్య భర్తను కానీ భర్త భార్యను కానీ అవమానించకూడదు. పిల్లల ముందు ఇలా అవమానించుకుంటే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఎప్పుడూ కూడా పిల్లలకి మంచి నేర్పడం.. మంచి విషయాలను మాట్లాడుకోవడం… తప్పు చేస్తే అది తప్పు అని చెప్పడం.. సక్రమంగా ప్రవర్తించడం వంటివి చేయాలి తప్ప ఇలా తప్పులు చేయకూడదు. దీని వలన పిల్లలు కూడా తప్పు త్రోవ పడతారు కాబట్టి తల్లిదండ్రులే జాగ్రత్తగా చూసుకోవాలి.

Also Read: ఆడవాళ్లు పెళ్లయ్యాక బరువు ఎందుకు పెరుగుతారు..? కారణం ఇదే..!

Previous articleతిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు చాలా మంది చేసే తప్పులివే..!
Next articleసినిమాలో అలా … రియల్ లైఫ్ లో ఇలా… సిద్ధు చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.!