Ads
చాలామంది ఎక్కువగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళుతూ ఉంటారు. కనీసం ఏడాదికి ఒక్క సారైనా వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. కేవలం మన దేశం వారు మాత్రమే కాకుండా విదేశాలలో ఉండే వాళ్ళు కూడా వస్తూ వుంటారు. అలానే విదేశాలలో వుండే భారతీయులు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు తిరుమలకి వెళుతూ ఉంటారు. అయితే కొంత మంది కాలి నడకని వెళ్తే కొంతమంది మాత్రం వాహనాల మీద శ్రీవారి కొండకి చేరుకుంటారు.
తెలియక చాలా మంది శ్రీవారిని దర్శనం చేసుకునేటప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు. మరి ఎటువంటి తప్పులు చేయకూడదు..?
ఎక్కువమంది ఏ తప్పులు చేస్తూ ఉంటారు అనే విషయాలని చూద్దాం. ఈసారి మీరు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లేటప్పుడు ఈ తప్పులను చేయకుండా చూసుకోండి. చాలా మంది తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకుంటారు కానీ అమ్మవారి దర్శనానికి వెళ్ళరు. కచ్చితంగా అమ్మవారిని కూడా దర్శించుకోవాలి. తిరుచానూర్ పద్మావతి అమ్మవారి దగ్గరకి భక్తులు కచ్చితంగా వెళ్లి తీరాలి. దీని వెనుక పెద్ద కారణమే వుంది. అదేమిటంటే.. ఏదైనా కావాలంటే మనం మన అమ్మనే అడుగుతాము. ఇక్కడ కూడా అంతే. మన కోర్కెలు తీరాలంటే అమ్మ దగ్గరకి వెళ్ళాలి. మన అమ్మ నాన్నని అడిగి ఒప్పించినట్టే ఈ అమ్మ కూడా చూస్తుంది.
Ads
అలానే శ్రీ గోవింద రాజుల స్వామి వారి ఆలయానికి కూడా వెళ్ళాలి. గోవిందరాజులు వారు పాలకడలిలో ఉండే శ్రీమహావిష్ణువు. మీరు అలిపిరి మెట్లు నుండి వెళ్ళచ్చు లేదంటే శ్రీవారి మెట్టు నుండి కూడా వెళ్ళచ్చు.
ఇక్కడ శ్రీవారిని దర్శనం చేసుకోగలుగుతున్నాం కదా దానికి కారణం వరాహ నరసింహస్వామి వారే. మొదట ఇక్కడ వరాహ నరసింహస్వామి వారే ఉండేవారు. వరాహ నరసింహస్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారు కాస్త చోటు అడిగారు. ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం దానికి బదులు ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం కావాలని వరాహ నరసింహస్వామి వారు అడిగారు. కనుక కచ్చితంగా వరాహ నరసింహస్వామి వారిని కూడా దర్శించుకుంటే మంచిది.