పెళ్లయ్యాక “రకుల్ ప్రీత్ సింగ్” జీవితం ఇలాగే ఉంటుందా? వేణు స్వామి ఏం చెప్పారంటే..?

Ads

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ హీరో, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానితో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి జరిగింది. డెస్టినేషన్ వెడ్డింగ్ గా వీరి పెళ్లి జరిగింది. గోవాలో జరిగిన వీరి పెళ్లికి ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యారు.

కానీ కేవలం సన్నిహితులని మాత్రమే పిలిచారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి రాహుల్ రవీంద్రన్, మంచు లక్ష్మి, సీరత్ కపూర్ వంటి ప్రముఖులు రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి వెళ్లారు. బాలీవుడ్ నుండి కొంత మంది నటులు వెళ్లారు. చాలా సింపుల్ గా, ఎకో ఫ్రెండ్లీ హోటల్ లో వీరి పెళ్లి చేసుకున్నారు.

rakul preet singh jackky bhagnani wedding venue cost

పంజాబీ-సింధీ పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది అని సమాచారం. వీరి పెళ్లిలో వడ్డించిన ఆహారం కూడా డైట్ ని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారు. అయితే, వీరి పెళ్లి గురించి, పెళ్లయ్యాక వీరి జీవితం ఎలా ఉంటుంది అనే విషయం గురించి ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామి చెప్పారు. వేణు స్వామి అంతకుముందు కూడా చాలా మంది ప్రముఖుల గురించి చెప్పారు. ఇదే విధంగా ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ గురించి వేణు స్వామి చెప్పిన ఇంటర్వ్యూ ఒకటి ట్రెండింగ్ లో ఉంది.

Ads

వేణు స్వామి ఈ విషయాన్ని రెండు సంవత్సరాల క్రితం చెప్పారు. ఆ తర్వాత కూడా చాలా సార్లు ఇదే విషయం గురించి చెప్పారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి రద్దు చేసుకుంటే సరే, లేదు అంటే ఇబ్బందులు వస్తాయి అని అన్నారు. ఎంగేజ్మెంట్ అయ్యాక రకుల్ ప్రీత్ సింగ్ కెరీర్ డౌన్ అయ్యింది. ఇబ్బందికి ఇది ఒక సంకేతం అని చెప్పారు. ఒకవేళ పెళ్లి జరిగినా కూడా తర్వాత విడిపోతారు అని అన్నారు. కుటుంబ విషయాల పరంగా రకుల్ ప్రీత్ సింగ్ సంతోషంగా ఉండలేరు అని చెప్పారు.

అలా అని వాళ్ళు విడిపోతారు అని చెప్పి చెప్పట్లేదు అని కలిసి ఉండే ప్రయత్నం చేయమని తాను చెప్తున్నట్టు వేణు స్వామి చెప్పారు. రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు చేసి చాలా కాలం అయ్యింది. భారతీయుడు 2 సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ సినిమా విడుదల అవ్వడానికి ఇంకా సమయం ఉంది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో మాత్రం నటించలేదు. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించినా కూడా అవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాలో నటిస్తే చూడాలి అని మాత్రం చాలా మంది అభిమానులు అనుకుంటున్నారు.

watch video :

ALSO READ : పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? ఎంత వరకు చదువుకున్నారు అంటే..?

Previous articleఈ పిల్లాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే ఏలేసే అంత పెద్ద హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?
Next articleడిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయిన ఈ కొత్త సినిమా చూశారా..? అసలు ఏం ఉంది ఇందులో..?