డ్రింక్ బాటిల్స్ అడుగున బొడుపులు ఎందుకు ఉంటాయి..? కారణం ఏంటో తెలుసా..?

Ads

బయటకు వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్స్ ని లేదంటే డ్రింక్ బాటిల్స్ ని మనం కొంటూ ఉంటాం. ఎండాకాలంలో అయితే చాలా మంది ఎక్కువగా కొంటూ ఉంటారు. ఎండలో బయటకు వెళ్ళినప్పుడు కూలింగ్ వుండే వాటర్ బాటిల్స్ ని కానీ డ్రింక్ బాటిల్స్ కానీ తీసుకుంటూ ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. వాటర్ బాటిల్స్ డ్రింక్ బాటిల్స్ వేరు వేరొక డిజైన్ చేయబడతాయి వాటర్ బాటిల్స్ కింద చూస్తే ఫ్లాట్ గా ఉంటుంది. అదే డ్రింక్ బాటిల్స్ కింద చూస్తే బొడుపులు మనకు కనబడుతూ ఉంటాయి.

ఎందుకు ఇలా డిజైన్ చేశారు..? వాటర్ బాటిల్స్ లాగే ఎందుకు డ్రింక్ బాటిల్స్ ని డిజైన్ చెయ్యలేదు..? ఇవి పనిచేస్తాయా లేకపోతే ఊరికే బొడుపులని పెట్టారా లాజిక్ ఏమైనా ఉందా అనే విషయాన్ని చూస్తే… సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ ని ఆ విధంగా డిజైన్ చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది.

Ads

సరదాగా డిజైన్ చేయలేదు. బాటిల్ లో ఉండే ద్రవాన్ని చల్లబరిచినప్పుడు వాల్యూం మారిపోతూ ఉంటుంది ఆ మార్పును తట్టుకోవడానికి ఈ బొడుపులు సహాయం చేస్తాయి. ఇవి ఎక్స్పాండ్ అవ్వడం కానీ కాంట్రాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. అంతేకాదు డ్రింక్ లో గ్యాస్ ఉంటుంది ఈ గ్యాస్ తట్టుకోవడానికి కూడా ఈ బొడుపులు అవసరం అవుతాయి. అందుకే వాటర్ బాటిల్స్ ఫ్లాట్ గా ఉంటాయి.

వాటికి ఈ పని అక్కర్లేదు కానీ డ్రింక్ బాటిల్స్ మాత్రం కచ్చితంగా ఇలానే డిజైన్ చేయాలి. పైగా ఈ బొడుపులు సర్ఫేస్ ఏరియా ని పెంచుతాయి ఇంకొంచెం ఐస్ ని లోపలకి పంపే విధంగా సహాయపడతాయి. దాంతో లోపల లిక్విడ్ చల్లగా అవుతుంది. పైగా బాటిల్ నిలబడేందుకు కూడా ఈ బంప్ సహాయం చేస్తుంది. ఇలా ఈ కారణాల వల్లనే సాఫ్ట్ డ్రింక్ బాటిల్స్ ని ఈ విధంగా డిజైన్ చేశారు అందుకనే ఏ డ్రింక్ బాటిల్స్ కైనా సరే అడుగున బొడుపులు కనబడతాయి.

Previous articleరైలు భోగిలో “డోర్” కి పక్కన ఉండే “కిటికీలకు” ఎక్కువ “ఊచలు” ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి అంటే..?
Next articleసీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా లోని చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!