Ads
విశ్వక్ సేన్ ఎప్పుడు రొటీన్ కి భిన్నంగా సినిమాలు తీస్తూ మాస్ కా దాస్ అనిపించుకున్నాడు. అలాగే అతని కొత్త సినిమా గామి సినిమా మార్చ్ 8న థియేటర్లలో రిలీజ్ అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందింది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఒక్క రూపాయి కూడా ఈ సినిమా కోసం నేను రెమ్యూనరేషన్ తీసుకోలేదు, లెక్కలు వేసుకుని చేసే సినిమా కాదు ఇది.
నా ఇమేజ్ ఈ చిత్రం మీద పడకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్నాం,ఈ సినిమా షూటింగ్ 2018లో మొదలైంది, సినిమాకి విద్యాధర్ కగిట దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన అప్పటినుంచి ఈ సినిమా మీదే పనిచేస్తున్నారు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నుమా దాస్ కంటే ముందు గానే మొదలైందని విశ్వక్ సేన్ వెల్లడించారు. ఈ సినిమాకి చాలా కాలం పడుతుందని అప్పట్లోనే తనకు అర్థమైందని అన్నారు. ఇలాంటి సినిమా ఇంతకుముందు ఎప్పుడు రాలేదని చెప్పారు.
Ads
సినిమాని త్వరగా కంప్లీట్ చేయాలంటే దాదాపు 100 కోట్లకు పైగానే బడ్జెట్ అవసరం అవుతుంది,అందుకే ఎంత కాలమైనా అద్భుతమైన క్వాలిటీతో ఈ చిత్రాన్ని తీసుకురావాలని అనుకున్నాం. పరిమిత బడ్జెట్లో అత్యున్నత క్వాలిటీ సాధించేందుకు మూవీ టీం సమయం తీసుకుంది. ఈ చిత్రం సరైన సమయంలో వస్తుందని మేము అనుకుంటున్నాం. ఈ సినిమాకి సుమారు 20 కోట్ల బడ్జెట్ అయినట్లు అంచనాలు ఉన్నాయి.
ముందు క్రౌడ్ ఫండింగ్ తో ఈ చిత్రాన్ని టీం మొదలుపెట్టగా ఆ తరువాత వీ సెల్యులాయిడ్ బ్యానర్ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. గామి సినిమాను హిమాలయాల్లో షూట్ చేశారు, ఆ సమయంలో మైనస్ 30 డిగ్రీల వాతావరణం లో ఈ సినిమా షూటింగ్ జరిగిందని అప్పుడు కాళ్లు చేతులు కూడా గడ్డకట్టేసేవని విశ్వక్ వెల్లడించారు.