చెక్కుపై డబ్బులు రాసి చివర్లో ”ONLY” అని ఎందుకు రాస్తారు…?

Ads

చెక్కుల మీద అమౌంట్ రాసిన తర్వాత ఆ అమౌంట్ ని బ్యాంక్ కి తీసుకు వెళ్లి మనం డబ్బుల్ని పొందొచ్చు. యూపీఐ నెట్ బ్యాంకింగ్ వంటివి రావడం తో క్యాష్ ట్రాన్సాక్షన్స్ బాగా తగ్గాయి. ప్రతీ ఒక్కరూ కూడా అవి సౌకర్యంగా వున్నాయి అని వాడుతున్నారు. అయితే పెద్ద లావాదేవీలకు అలానే రుణం తీసుకోవాల్సిన వచ్చినప్పుడు చెక్కులని చాలా మంది వాడుతూ ఉంటారు.

చెక్కు మీద సంతకం చేయడం డబ్బులు రాయడం వంటివి జరుగుతుంటాయి. అయితే డబ్బులు అన్నీ రాసిన తర్వాత డబ్బులు పక్కన ఓన్లీ లేదా మేరే అని రాస్తూ ఉంటారు. అయితే ఎందుకు ఓన్లీ అని రాయాలి..? దాని వెనక కారణం ఏంటి..? ఎప్పుడైనా మీకు కూడా ఈ సందేహం వచ్చిందా…

అయితే ఇప్పుడే దాన్ని క్లియర్ చేసుకోండి… బ్యాంకు వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ప్రకారం మనం అనుసరిస్తూ ఉండాలి. మనం బ్యాంక్ అకౌంట్ తీసుకున్న తర్వాత చెక్ బుక్ కావాలా అని వాళ్ళు అడుగుతారు. అవసరమున్న వాళ్ళు చెక్ బుక్ ని కూడా తీసుకుంటారు. లేకపోయిన వాళ్ళు వద్దు అని చెప్తారు. చెక్ ని నింపేటప్పుడు డేట్ సంతకం అమౌంట్ ని రాస్తూ ఉంటాము.

Ads

మీ డబ్బు సురక్షితంగా ఉండడానికి ఇది జరుగుతుంది. మీరు చెక్కుపై ఓన్లీ అని రాయకపోతే మీ చెక్కు చెల్లుబాటు అవ్వదు అని ఏమి కాదు. చెక్కు పై ఓన్లీ అని రాయడం వలన డబ్బులు సేఫ్ గా ఉంటాయి. మీరు చెక్ పై డబ్బుని నింపి చివర్లో ఓన్లీ అని రాసినప్పుడు ఎవరు కూడా దానిలో అమౌంట్ ని పెంచలేరు. మీ డబ్బులు ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. ఫ్రాడ్స్ ని ఆపవచ్చు. చివరన అమౌంట్ ని ఎవరు యాడ్ చేసేందుకు అవ్వదు.

అలానే మీరు జాగ్రత్తగా చూసినట్లయితే చెక్ మూలలో గీసిన గీతలు చూడొచ్చు. ఎందుకు ఆ గీతలు వుంటాయో చూస్తే… చెక్కుపై ఈ గీతలను గీయడం వలన షరతు విధించబడుతుంది. చెక్కు జారీ చేయబడిన వ్యక్తి కోసం ఈ గీతలు గీస్తారు. ఈ లైన్ చెల్లింపు ఖాతా సూచనగా పరిగణించబడుతుంది. ఇదిలా ఉంటే రెండు లైన్లు గీసిన తర్వాత చాలామంది ఖాతా చెల్లింపు లేదా A/C పేయీ అనీ వ్రాస్తారు. ఇది చెక్కు నగదును ఖాతాకు బదిలీ చేయాలని చూపిస్తుంది.

Previous articleవామ్మో వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. మీరు చూసారా…?
Next articleకార్లు మీద lxi,vxi,zxi,vdi అని ఎందుకు ఉంటాయి..? అర్ధం ఏమిటో తెలుసా..?