రైలు భోగిలో “డోర్” కి పక్కన ఉండే “కిటికీలకు” ఎక్కువ “ఊచలు” ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి అంటే..?

Ads

రైలులో దూర ప్రయాణాలు చేస్తే ఎంతో బాగుంటుంది. ట్రైన్ లో వెళ్తే మనకి చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. ట్రైన్ లో ట్రావెల్ చేయడం ఈజీగా ఉంటుంది. పైగా కంఫర్ట్ గా మనం ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేసేయొచ్చు. ముఖ్యంగా ఎక్కువ మంది మనం ట్రైన్ లో వెళ్తే సమయమే తెలియకుండా సమయాన్ని గడపొచ్చు. ట్రావెల్ చేసేసి అద్భుతమైన జ్ఞాపకాలని మనం బిల్డ్ చేసుకోవచ్చు. రైలులో కిటికి సీటు దగ్గర కూర్చోవడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు.

train

కిటికీను గమనించినట్లయితే రాడ్లు ఉంటాయి. సాధారణంగా ఉండే కిటికీలకు మధ్యన ఉండే ఊచలు దూరంగా ఉంటాయి. అదే మనం డోర్ దగ్గర వుండే కిటికీలని చూస్తే మధ్యన ఉండే ఊచలు బాగా దగ్గరగా ఉంటాయి. ఎందుకు అన్ని కిటికీలు లాగ ఈ కిటికీ ఉండదు..? కారణం ఏమిటో ఇప్పుడే చూద్దాం.

Ads

కోచ్ డోర్ కి దగ్గరగా ఉండే కిటికీ దగ్గర నుంచి దొంగతనం జరిగే ఛాన్స్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. మనకు తెలియకుండా వెనకాల డోర్ వద్ద ఎవరైనా అపరిచితులు నిలబడి మన విలువైన వస్తువులని దొంగతనం చెయ్యచ్చు. ఊచలు దూరంగా ఉంటే దొంగతనం సులువు అవుతుంది. అందుకే కిటికీ దగ్గర ఊచలు బాగా దగ్గరగా ఉంటాయి. దానితో అలాంటి దొంగతనాలు ఏమి కూడా జరిగే ఛాన్స్ ఉండదు. ఊచలు దగ్గరగా దగ్గరగా ఉంటే చేతులు ట్రైన్ లోపలకి పట్టవు.

సో దొంగలు ఎవరైనా వున్నా కూడా మన వస్తువులు తీసేందుకు ఛాన్స్ ఉండదు. మనం నిద్రపోయినా లేదంటే కాస్త పరధ్యానంగా వున్నా కూడా దొంగతనం జరగడానికి ఛాన్స్ ఏ ఉండదు. మిగిలిన కిటికీలన్నీ కూడా కోచ్ డోర్ కి దూరంగా ఉంటాయి కనుక దొంగతనం జరిగే అవకాశం ఉండదు. ఎక్కువ డోర్ పక్క కిటికీకి ప్రమాదం కనుక అలా దగ్గరగా ఊచలు ఉంటాయి.

Previous articleఅంబేడ్కర్ విగ్రహాలు నీలం రంగులోనే ఎందుకు ఉంటాయి..? కారణం ఏమిటి అంటే..?
Next articleడ్రింక్ బాటిల్స్ అడుగున బొడుపులు ఎందుకు ఉంటాయి..? కారణం ఏంటో తెలుసా..?