టెస్ట్ మ్యాచ్ల సమయంలో ”ఆస్ట్రేలియా” జట్టు ఆఫ్ వైట్ దుస్తుల్ని వేసుకుంటారు..?

Ads

క్రికెట్ చూస్తూ ఉంటే సమయం తెలియదు. పైగా వారి దేశాల వాళ్లు గెలవాలని క్రికెట్ అభిమానులు మ్యాచ్ ని చూస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. ఐపీఎల్ మ్యాచ్లు టెస్ట్ మ్యాచ్లు ఇలా చాలా రకాల మ్యాచులు జరుగుతూ ఉంటాయి. అయితే మ్యాచ్లని బట్టి క్రికెటర్ల దుస్తులు కూడా ఉంటాయి. టెస్ట్ మ్యాచ్లు సమయంలో తెలుపు రంగు వాటిని ఎంపిక చేసుకుంటూ ఉంటారు.

అయితే ఎప్పుడైనా మీకు ఈ సందేహం కలిగిందా.? టెస్ట్ మ్యాచ్ లు సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ టీం ఎందుకు ఆఫ్ వైట్ బట్టల్ని వేసుకుంది అనేదాని వెనుక కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

టెస్ట్ మ్యాచ్లప్పుడు అన్ని క్రికెట్ టీం లో వాళ్ళు కూడా తెలుపులో వివిధ రకాల షేడ్స్ ని ఎంపిక చేసుకుంటూ ఉంటారు. కొందరు బ్రైట్ గా ఉండే వాటిని ఎంపిక చేసుకుంటే కొందరు లైట్ గా ఉండే వాటిని ఎంపిక చేసుకుంటూ వుంటారు. ఉదాహరణకి వెస్టిండీస్ వాళ్లని చూస్తే టెస్ట్ మ్యాచ్లు సమయంలో వెస్టిండీస్ ఆటగాళ్లు రెడ్డిష్ వైట్ ని ఎంపిక చేసుకుంటారు. అదే ఇంగ్లాండు వాళ్ళు అయితే బ్లూయిష్ వైట్ ని ఎంపిక చేసుకుంటారు. ఇండియా అయితే ఆఫ్ వైట్ లేదంటే కొంచెం డార్క్ రంగులో ఉండే తెలుపు రంగుని ఎంపిక చేసుకుంటూ ఉంటారు.

Ads

హోస్ట్ చేసే వాళ్ళు కంటే మిగిలిన టీం వాళ్ళు బ్రైట్ షేడ్ ని వేసుకుంటారు. అయితే ఇలా ఎంపిక చేసుకోవడం వలన సులభంగా ఏ ఆటగాళ్లు ఏ జట్టు అనేది ఆడియన్స్ కి తెలుస్తుంది. టీవీలో కూడా క్లియర్ గా కనబడుతుంది. అందుకనే ఇలా తెలుపు రంగులోనే షేడ్స్ ఉంటాయి. అయితే ఆటగాళ్లు ఏ రంగు వాటిని వేసుకోవాలనేది ఆటకి ముందే నిర్ణయించుకుంటారు. ఇలా ఆటకి ముందు నిర్ణయించుకుని కేవలం షేడ్స్ లో మార్పులు ఉండేలా చూసుకుంటారు. అప్పుడు ఆడియన్స్ కి బాగా కనపడుతుంది. ఇలా షేడ్స్ ఉండడం వలన మనకి కూడా ఏ ఆటగాళ్లు ఏ జట్టుకి సంబంధించిన వారు అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది.

Previous articleతెలుగు సినీ ఇండస్ట్రీలో వీళ్ళే ఫ్యూచర్ స్టార్స్..
Next articleటెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు.. ఆటగాళ్లు 11:30 AM కి ఎందుకు భోజనం చేసేస్తారు..?