తెలుగు సినీ ఇండస్ట్రీలో వీళ్ళే ఫ్యూచర్ స్టార్స్..

Ads

తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్ లు సక్సెస్ ఫుల్ గా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. వారి తరువాత జనరేషన్ లో స్టార్ హీరోలైన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్స్ గా రికార్డులను క్రియేట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇక మాస్ మహారాజ రవితేజ, నాని, రానా, నాగచైతన్య, అఖిల్, విజయ్ దేవరకొండ, శర్వానంద్, సాయితేజ్, సుధీర్ బాబు, వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, వైష్ణవ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డల వంటి హీరోలు తమదైన ప్రత్యేక ఇమేజ్ తో కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అయితే టాలీవుడ్ లో ఫ్యూచర్ స్టార్ హీరోలు ఎవరు అనే ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ సమాధానాలు సినివర్గాల్లో వినిపిస్తున్నాయి. హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఈ సంవత్సరంలోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. నందమూరి మోక్షజ్ఞ తన మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించినట్లయితే హీరోగా ఆయనకు తిరుగుండదని సామాజిక మధ్యమాలలో కామెంట్లు చేస్తున్నారు. ఇక మోక్షజ్ఞ ‘ఆదిత్య369’ సీక్వెల్ స్టోరీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ హీరోగా త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అకీరాకు ఫ్యాన్ బేస్ ఎక్కువగానే ఉండడంతో పవన్ కళ్యాణ్ లాగే అకీరా కూడా హీరోగా విజయం సాధిస్తారని నెట్టింట్లో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడు గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఎన్నో సినిమాలలో నటించాడు ఆ తరువాత హీరోగా తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా దూసకెళ్తున్నారు. మహేష్ కుమారుడు గౌతమ్ కృష్ణకు ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు. గౌతమ్ కూడా బాలనటుడిగా నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో నటించి అలరించాడు. మరో ఐదేళ్ల తరువాత గౌతమ్ కూడా హీరోగా కెరీర్ ను ప్రారంభించే అవకాశం ఉంది.ఈ లిస్ట్ లో తరువాత ఉన్నది అర్జున్. విక్టరీ వెంకటేశ్ కుమారుడు అర్జున్ దగ్గుబాటి రాబోయే కొనేళ్ళలో ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశం ఉంది.

పది సంవత్సరాల తరువాత సినిమా పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి. ఆ టైమ్ లో ఓటీటీ ప్లాటఫామ్స్ హవా మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Also Read: మహేష్-నమ్రత 18 ఏళ్ళ వివాహ బంధం.. అరుదైన ఫోటోని షేర్‌ చేసిన నమ్రత..

Previous articleభారీ అంచనాలతో రిలీజ్ అయ్యి.. డిజాస్టర్లుగా మిగిలిపోయిన చిరంజీవి 4 సినిమాలు ఇవే..!
Next articleటెస్ట్ మ్యాచ్ల సమయంలో ”ఆస్ట్రేలియా” జట్టు ఆఫ్ వైట్ దుస్తుల్ని వేసుకుంటారు..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.