ప్రభాస్ సొంత అన్నయ్య సినిమాల్లోకి రాలేదు.. ఆయన అసలు ఏం చేస్తారు..?

Ads

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ఎంతో పేరు ప్రత్యేకతను సంపాదించుకున్నారు. తనదైన నటనతో మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నారు. సినిమాల్లోకి హీరోగా ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో పరిచయం అయ్యారు. అలా ప్రభాస్ ఈశ్వర్ సినిమాతోనే మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. తర్వాత వరుస సినిమాలు చేసి క్రేజ్ ని పెంచుకున్నారు. వచ్చిన అవకాశాలను దక్కించుకుంటూ ప్రత్యేక గుర్తింపుని పొందారు.

బాహుబలి వంటి పెద్ద పెద్ద సినిమాల్లో కూడా నటించి ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. అయితే ప్రభాస్ కి ఒక అన్న ఉన్నారు. అతని పేరు ప్రబోద్. ప్రబోద్ ఇండస్త్రీ లోకి రాలేదు. ఎప్పుడు ప్రబోద్ ఇండస్ట్రీ కి దూరంగానే ఉన్నారు. అసలు అతని ఏం చేస్తాడు సినిమాల్లోకి ఎందుకు రాలేదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

Ads

కృష్ణంరాజు అంత్యక్రియలు జరిగినప్పుడు ప్రభాస్ సోదరుడు ప్రబోద్ చేతుల మీదగా అంత్యక్రియలు జరిగాయి ఈ విషయం మనకు తెలిసిందే. ప్రబోద్ సినిమాలకి దూరంగానే ఉంటాడు చిన్నప్పటినుండి వ్యాపారం అంటేనే ఇష్టం. కృష్ణంరాజు అప్పట్లో అతన్ని హీరోగా రమ్మని అడిగినా కూడా ఆసక్తి చూపించలేదు సినిమా నిర్మాణ కార్యక్రమానికి కూడా అటెండ్ అవ్వలేదు. ఏ మాత్రం ఆసక్తి చూపలేదు. ప్రభాస్ సన్నిహితులు యూవీ క్రియేషన్స్ ని స్టార్ట్ చేసినప్పుడు ప్రబోద్ ని కూడా పార్టనర్ గా అనుకున్నారు.

కానీ ఇండస్ట్రీ లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదని చెప్పేశారు. మీడియా ముందుకు కూడా ప్రబోధ్ ఎప్పుడు రాలేదు. రాడు కూడా. ప్రబోధ్ గురించి చాలామందికి అసలు తెలియనే తెలియదు. ప్రబోద్ రాబోయే రోజుల్లో ఎంటర్టైన్మెంట్ రంగంలో కనపడతాడా అనే ప్రశ్నకి లేదని అంటున్నారు ఆయన సన్నిహితులు. ప్రబోద్ కి రాజకీయాల మీద ఆసక్తి ఉన్నట్లు తెలుస్తోంది భవిష్యత్తులో అతను రాజకీయాలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది సినిమాల్లోకి మాత్రం వచ్చే ఛాన్స్ లేదట.

Previous articleహీరోయిన్ లేకుండా హిట్ అయిన 6 సినిమాలు ఇవే..!
Next articleరాధేశ్యామ్ మూవీ లో ఈ సీన్ ని గమనించారా..? రాధాకృష్ణుల తో లింక్ ఏమిటి..?