Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఆడియెన్స్ పరిచయం అవసరం లేని పేరు. పవన్ కళ్యాణ్ వెండితెర పై చేసే నటనకి పడిపోని వారు ఉండరు.పవర్ స్టార్ మేనియా గురించి అందరికి తెలిసిందే. పవన్ పేరు చెప్తే అభిమానుల చేసే గోల అంతా ఇంత కాదు.
Ads
పవన్ కళ్యాణ్ ఒక వైపు మూవీస్ లో నటిస్తూనే ఇంకోవైపు రాజకీయాలలోనూ జనసేన పార్టీ స్థాపించి ప్రజల కోసం పోరాటాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం విషయంలోకి వస్తే ఆయన మూడు వివాహాలు చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. పవన్ మొదటి వివాహం విశాఖకు చెందిన నందిని అనే అమ్మాయితో జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు చిరంజీవి ఈ వివాహం చేశారు. కానీ పెళ్లి అయిన ఏడాదికే మనస్పర్థలతో విడిపోయారు.ఆ తర్వాత పవన్ తాను హీరోగా నటించిన బద్రి, జానీ చిత్రాల్లో నటించిన రేణుదేశాయ్ తో సహజీవనం చేసి, ప్రజారాజ్యం పార్టీ సమయంలో పెళ్లి చేసుకుని భార్యగా స్వీకరించినా, కొద్ది కాలానికే పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ విడిపోయారు. పవన్ కళ్యాణ్ రష్యాకు చెందిన అన్నాలెజ్‌నోవాని మూడవ వివాహం చేసుకున్నాడు.
ఈమె పవన్ కళ్యాణ్ త్రిష నటించిన తీన్మార్ మూవీలో ఓ సన్నివేశంలో నటించింది. అప్పుడే వీరిద్దరికి పరిచయం కాగా, ఆ తరువాత ప్రేమగా మారి ఆమెను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2011 నుండి సహజీవనం చేయగా, వారికి ఇద్దరు పిల్లలు కలిగారు. కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్, కూతురు పేరు పోలెనా అంజనా పవనో అని పెట్టారు.
అన్నాలెజ్‌నోవా క్రిస్టియన్ కానీ, పెళ్లి తరువాత పూర్తిగా హిందువు అయిపోయింది. సాంప్రదాయబద్దంగా తన కట్టుబొట్టుతో అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె సోషల్ మీడియాకు చాలా దూరం.ఇక ఆమె ఆస్తుల గురించి చూస్తే అన్నాలెజ్‌నోవా పేరుతో 1600 కోట్ల కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయని సమాచారం. పవన్ 2011 నుండి ఆమె పేరున కొన్ని ఆస్తులను కొంటువస్తున్నట్టు తెలుస్తోంది.అది కాక ఆమె మోడల్ గా చేసినపుడు కొన్ని ఆస్తులను సమకూర్చుకుంది. అప్పట్లో అన్నాలెజ్‌నోవా కొన్న ఆస్తుల విలువ ప్రస్తుతం బాగా పెరిగిపోయాయి.
Also Read: మహేష్ బాబు మామగారు.. నమ్రత తండ్రి.. స్టార్ క్రికెటర్ అని తెలుసా?